Posts

Showing posts from August, 2020

ది స్మోక్! ఎవరైనా చూసారా? - సీరియల్ స్టోరీ -పార్ట్ 3

Image
  జరిగిన కథ: సీరియల్ మర్డర్ కేసులో ఐదవ కేసును ఇన్వెస్టిగేషన్ చేయడానికి వెళ్తాడు వర్మ. సీసీ కెమెరాలను చెక్ చేస్తారు. కానీ అవసరమైన చోట కెమెరాలు లేక పోవడం వలన నేరస్తులను గుర్తించలేకపోతాడు వర్మ. ఇంతలో ఒక ఇంటి యజమాని తనకు చిన్న క్లూ ఇస్తాడు.  వర్మ తాను శాకరించిన వివరాల ఆధారంగా ఇన్విస్టిగేటషన్ చేస్తాడు. ఆ ఇన్విస్టిగేషన్లో వాళ్ళు ఒక వేన్ ని అనుసరిస్తారు. కానీ అది వాళ్ళ కళ్ళు గప్పి అదృశ్యం అవుతుంది.  ***** రాత్రి తొమ్మిదయినా తన ఛాంబర్ లో కూర్చుని ఆలోచించుకుంటున్నాడు వర్మ.  అంత షడన్ గా ఆ కారు ఎలా మాయమైంది. ఆ ప్రాంతమంతా జల్లెడ పట్టి వెతికారు. అయినా ఫలితం లేకపోయింది. కష్టం అంటా వృధా అయింది. పొరపాటు ఎక్కడ జరిగింది. అంత తెలివిగా ఎలా తప్పించుకో గలిగారు వాళ్ళు.  వేన్లో పట్టుబడిన ఆ నలుగురూ అస్సలు నోరు విప్పటం లేదు. కొట్టి కొట్టి అలసిపోతున్నారు వాళ్ళ నుండి విషయం రాబట్టడానికి.  బూట్ల సౌండ్ విని తల పక్కకి తిప్పి చూసాడు వర్మ.  కానిస్టేబుల్  స్టిఫ్ గా నిలబడి సెల్యూట్ చేసాడు.  సార్ మీకోసం ఎవరో సూరిబాబు వచ్చాడు. మీకు ఏదో చేప్పాలంట.  అన్నాడు.  సరే తీసుకురా...

ది స్మోక్! ఎవరైనా చూసారా? - సీరియల్ స్టోరీ -పార్ట్ 2

Image
జరిగిన కథ: సీరియల్ మర్డర్ కేసులో ఐదవ కేసును ఇన్వెస్టిగేషన్ చేయడానికి వెళ్తాడు వర్మ. సీసీ కెమెరాలను చెక్ చేస్తారు. కానీ అవసరమైన చోట కెమెరాలు లేక పోవడం వలన నేరస్తులను గుర్తించలేకపోతాడు వర్మ. ఇంతలో ఒక ఇంటి యజమాని తనకు చిన్న క్లూ ఇస్తాడు.  మీడియా వాళ్ళు వర్మను చుట్టుముట్టారు. అంతా గోల గోల గా ఉంది. వాళ్ళ నుండి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచించుకునే లోపే వర్మను చుట్టుముట్టారు  హలో సార్. ఈ హత్య ఎలా జరిగింది? ఎవరు చేసి ఉంటారు? గతంలో జరిగిన హత్యల విషయం ఇంకా దర్యాప్తులో ఉండగానే మరో హత్య జరిగింది. మీ ప్లాన్ అఫ్ ఏక్షన్ ఏమిటి ? సిటీ లో జనం భయాందోళనల తో ఉన్నారు. వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు?... గుక్క తిప్పుకోకుండా అడిగాడు ఒక ఛానెల్ ప్రతినిధి.  హంతకులను త్వరలోనే పట్టుకుంటాం. ప్రజలెవ్వరూ భయపడ వలసిన అవసరం లేదు. సినిమా స్టైల్ లో ఆన్సర్ ఇచ్చాడు వర్మ.  ఇంకెన్నాళ్లు సార్? హంతకుడు స్వేచ్ఛగా తిరుగుతూ ఒకటి తర్వాత ఒకటి చేస్తున్నాడు. మీరు మాత్రం వస్తారు వెళ్తారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఫెయిల్ అయ్యిందని జనం అనుకుంటున్నారు. అన్నాడు మరో విలేఖరి.  జనం అనుకుంటున్నారా మీరు అంటున్నారా?...

గణేశా టూ భూ లోకమ్! కానీ ఇది కరోనా టైమ్!!

Image
గణపతి : మాతా పితరులకు అభివందనాలు.  పార్వతీదేవి : నాయనా ఎక్కడకి ఇంతలా ముస్తాబు అయ్యావు? గణపతి : మీకు తేలియానిది ఏమున్నది మాతా ! ప్రతి సంవత్సరము లాగే ఈ సంవత్సరము కూడా నేను నా పుట్టినదినము భూలోకమునకు  ఏ గుచున్నాను.  శివుడు : నాయనా ప్రతి సంవత్సరమూ వెళ్ళుచుంటివి కదా. ఈ స్సంవత్సరము మానుము.  గణపతి : అదేమీ తండ్రీ! నేను వెళ్ళుటకు ఏమి ఆటంకము ? శివుడు : కలి వశంబున భూలోకమున ఈ సంవత్సమున కరోనా కంటకుడు సంచరించు చున్నాడు. వాడు ఎవని నేని తాకేనేని నాసికా రంధ్రములలోకి పోయి తీవ్రమైన అనారోగ్యము కలిగించును.  గణపతి : తండ్రీ! నేను మీ కుమారుడును. భయమెరుగని బ్లడ్డు నాది. నాకు కూడా హాని జరుగునా? దేవలోకం లోనే మనది మెగా ఫామిలీ. పార్వతీదేవి : నాయనా ఆ ఇంగ్లీషు పదములు మనుము . కనీసం మాముందర నైననూ స్వచ్ఛమైన భారతీయ భాషలో ఉఛ్చరించుము.  గణపతి : మన్నించుము మాతా ! ప్రతీ సంవత్సరమూ తొమ్మిది నుండి పదిహేను దినములు భూలోకమున ఉందును కదా ! పదములు అనుకోకుండానే ఉచ్ఛరించ బడుచుండెను. అదియునూ కాక ఇప్పుడు ప్రపంచమంతటనూ నాకు గుళ్ళూ గోపురములను మానవులు కట్టించి కొలుచు చున్నారు. ఆ సాంగత్యమున నాకు ప్రపంచ భాషలు కూడా...

సందిట్లో సడేమియా! వరుణదేవుడు వచ్చెనయా!

Image
స్వర్గంలో:.... వాన దేవుడు: ఇంద్ర సార్! ఎందుకో కాల్ చేసారట? ఇంద్రుడు: యస్ మిస్టర్ రెయిన్! ఇదిగో ఆర్డర్స్! నువ్వు వెంటనే భూలోకం వెళ్ళి డ్యూటీ చెయ్యాలి! అక్కడ జనం కరోనా కంటకాసురుడంటే భయంలేకుండా తిరుగుతున్నారట! వాళ్ళకి భయం అంటే ఏమిటో చూపించు! ఒక్కడు కూడా బైటికి రాకూడదు! ఇట్స్ మై ఆర్డర్! వాన దేవుడు: యస్ బాస్! ఇప్పుడే వెళ్తా గొడుగులు చిల్లులు పడేలా వర్షం కురిపిస్తా! ఎవరూ బయటికి రాకుండా వరదలు పొంగిస్తా! ఇంద్ర: సినిమా డైలాగులొద్దు! పని చూడు! నాకు వెంట వెంటనే రిపోర్టు పంపించు! వాన దేవుడు: ఓకే! బట్ వన్ థింగ్! ఆ ఎయిర్ డిపార్ట్ మెంట్ హెడ్ మిస్టర్ వాయ్ కరోనాతో హేండ్సు కలిపాడని తెలుస్తోంది. నేను ఎంత కష్టపడి వాళ్ళని బయటికి రాకుండా చేసినా ఎయిర్ హెల్పుతో ఆ కరోనా గాడు ఇళ్ళల్లోకి స్ప్రెడ్ ఐతే ఐ కాంట్ మేనేజ్! నేనేమీ చేయలేను. ఇంద్ర: హుమ్... నేను వాయూ సంగతి చూసుకుంటాను ఫస్ట్ నువ్వు వెళ్ళి నేను చెప్పింది చేయ్. ఇండియాలో... బ్రేకింగ్ న్యూస్! రానున్న నలభైఎంది గంటల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక! లోతట్టు ప్రాంతాల వాళ్ళని ఎత్తైన ప్రాంతాలకి తరలించేందుకు సహాయక చర్యలు ముమ్మరం! చిన్న బ్ర...

ది స్మోక్! ఎవరైనా చూసారా? - సీరియల్ స్టోరీ -పార్ట్ 1

Image
డిమ్ లైట్ కాంతి లో ఆ రూమ్ అస్పష్టంగా  ఉంది.  చాలా అస్పష్టంగా...   కానీ అది రాత్రి కాదు. అప్పటికి సమయం ఉదయం పది గంటలయింది .  కానీ ఆ రూమ్ మాత్రం కాంతి లోపలికి చొరబడనంత చీకటి గా ఉంది. సీలింగ్ కి అమర్చిన ఫ్యాన్సీ నైట్ బల్బు సన్నటి వెలుగు ఆ రూమ్ మధ్యలో ఉన్న మంచం , కనీ కానీ కనిపించని ఫర్నీచర్...  చాలా నిశ్శబ్దం గా ఉంది. కానీ ఆ రూమ్ బయట సిటీ బిజీ గా ఉంది.  నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ సెల్ ఫోన్ మ్రోగింది. ఒకసారి కాదు... అలా మ్రోగుతూనే ఉంది.  కానీ ఆ మంచం మీద కదలికలు లేవు. సమయం మధ్యాహ్నం పన్నెండు దాటింది. కొంత సేపటికి పెద్ద శబ్దాలు... తలుపులని ఎవరో  బ్రద్దలు కొడుతున్నారు.  గట్టిగా అరిచి పిలుస్తున్నారు. లోపల మాత్రం ఎటువంటి కదలికా లేదు. భళ్ళున తలుపులు తెరుచుకొని లోపలి కొంతమంది వచ్చారు.  ఎవరో లైట్ వేశారు. లైట్ వెలుగులో రూమ్ చిందరవందరగా కనిపించింది. మంచం మీద బేంకులెట్సు అస్తవ్యస్తంగా ఉన్నాయి . కానీ ఎవ్వరూ లేరు. బాత్రూమ్ తలుపు దగ్గరగా వేసి ఉంది. అందులో లైట్ వెలుగుతూ ఉంది. వచ్చిన వాళ్లలో ఒక వ్యక్తి కొంచెం అనుమానంగా చూసాడు. బాత్రూమ్ వైపు అడు...

నువ్వే దేవుడివి అయితే దేవుడే నీ వాడు - కథ

Image
అనంతా చార్య  బిఎ తో చదువు ఆపేశాడు. ఒక చిన్న బట్టల దుకాణంలో సేల్సు మేన్ ఉద్యోగం చేస్తున్నాడు. జీతం నెలకు ఐదువేల రూపాయలు. ఆ జీతంతో ఫామిలీని పోషించడం చాలా కష్టంగా ఉంది అతనికి. కానీ అంతకన్నాపెద్ద ఉద్యోగం  వచ్చేలా లేదు. చాలా ట్రై చేసి ఇక లాభం లేదని వదిలేసి ఇలా సెటిల్ ఐపోయాడు. ఇరవయ్యేళ్ళ ఉద్యోగం లో అతను వెనకేసుకున్నది ఏమీ లేదు. అప్పులు తప్ప.  ఇప్పుడు కొడుకు ని ఫీస్ రీఎంబర్సుమెంట్ ని ఉపయోగించుకుని ఓ ప్రయివేటు కాలేజీలో బిటెక్ చదివించాలని అనుకున్నాడు. కానీ ఓసీ కాండిడేట్ కావడం వలన అతనికి సీటు సంపాదించుకో లేకపోయాడు. ఆస్తులు అమ్ముకుని చదివించే అవకాశమే లేదు.  అతని చేతకాని తనాన్ని అతనే తిట్టుకోవడం ఒక ఎత్తైతే ...  భార్య విమర్శలు, కొడుకు నిర్లిప్తత అతనిని మరింత బాధకు గురిచేశాయి. కూతురు టెన్త్ సెకండ్ క్లాస్ లో పాసై ఇంటర్ లో ప్రయివేట్ కాలేజీలో చదివించమని  ఒత్తిడి చేస్తోంది. అటు కొడుకుని బిటెక్  చదివించ లేక, ఇటు కూతురిని ఇంటర్ ప్రయివేట్ కాలేజీ లో అడ్మిషన్ సంపాదించ లేక, పాత అప్పులు తీర్చ లేక ఇంట్లో భార్య నస  భరించలేక, అప్పుల వాళ్ళ దాడులు తట్టుకోలేక  ఇల్లు విడిపె...

భారత పదాతి, వాయు, నావికా దళాలకు అంకితం - తెలుగు పద్యాలు

Image
  భారత పదాతి, వాయు, నావికా దళాలకు అంకితం: భారత జాతికేతనము భాగ్యత నొందగ కీర్తివంతమై ధీరత జూపి దేశమున దీక్షగ నిల్చిన వీర సైనికా! తీరపు దేశహద్దులను తీరుగ గాచు సురక్ష కారకా! ఆరఘు రామదీవెనలు అండగ యుండును నీకు మెండుగా! సాగర మందుశూరునిగ సాయుధ నౌకల తేలియాడుచున్ జాగర మొంది దేశమును జాగిల మల్లెను జాగురూకమై రాగల కీడు ముందె గని రాముని సేనగ రక్షజేయుచున్ చేగల శౌర్య నావికుల చేతన శక్తికి వందనం బిదే! దీటుగ వాయువేగముగ దిక్కులు చీల్చుతు దూసుకెళ్ళుచూ మాటున దాగిదేశమును మబ్బుర రీతిని గాపుకాచుచూ ఘాటుగ వేగవంతముగ గన్పడు లక్ష్యము లెల్ల గూల్చుచూ కాటుక చీకటైన వెనుకాడని శక్తివి వాయుసైనికా!

గాన గంధర్వుడు ఎస్. పి. బాల సుబ్రహ్మణ్యం గారి ఆరోగ్యం బాగుండాలని ఆశిస్తూ

Image
గాన గంధర్వుడు ఎస్. పి. బాల సుబ్రహ్మణ్యం గారి ఆరోగ్యం బాగుండాలని ఆశిస్తూ...  గాయక లోకబాంధవుడు గానవిలోలుడు సుభ్రమణ్యమై మాయని కీర్తినొంది సినిమాకొక తీయని తేనెధారయై! ఊయలలూపినాడు తనయూపిరి పాటకు ప్రాణమద్దుచున్ న్యాయమ దైవమా ఇటుల యాతని రోగపు రొచ్చుదింతువా! అతని బాగుజేసి మరి ఆయువు పెంచుము దీర్ఘకాలమున్ చేతన శక్తినిచ్చి సరిచేయుము కోవిడు కాలపాశమున్! లోతగు గుండెగాయములు లోక వినోదికి చేయజూతువా! రాతను మార్చివేయుమిక రక్కసి కోరలు వమ్ముజేయుచున్! Image Credits ( Naidunia.com )

ధోనీ కి అంకితం - తెలుగు పద్యాలు

Image
  క్రికెటర్ ధోనీ కి అంకితం: ఉత్పలమాల లో ధోనిగ పేరుపొందితివి దోషము లేని విజేతవై భళా! బూనిన సూర్య తేజములె భూమిన బుట్టెను నీదురూపుగా! లేనివి చెప్పలేము కద లేశము నైనను భారతీ సుతా! దీనికి దానికేల జన దీవెన నీకె నిజంబు ధీరుడా! కప్పులు కొట్టిజూపితివి కట్టుగ జట్టుకి నాయకుండవై నిప్పులు చెండు తీరుగను నిర్దయ జూపక నిక్కి నీల్గుచూ రొప్పుచు వేయు బంతులను రోషము మీరగ దూసి కొట్టుచూ చప్పున గెల్చినావు కద చక్కగ నీవు ప్రపంచ కప్పునే! కష్టములెన్నొ దాటి హెలికాప్టరు షాటుతొ కీర్తినొందగా ఇష్టము మీద నాడితివి ఇంటరునేషను మేచులెన్నియో పుష్టము జేత లేపితివి పుష్టిగ సిక్సులు యాట నేర్పుతో నష్టము లేదు నీకిది ఘనంబగు ధోని విరామమొందుమా! MS Dhoni (Credits: Twitter)

అతనొక అనితర సాధ్యం

Image
సామాన్యుడిగా జీవితం ప్రారంభించి నమ్మిన ఆశయాలకు కట్టుబడి, అంచెలంచెలుగా ఎదిగి, కర్తవ్యమే దీక్షగా పార్టీని ముందుకు నడిపించడమే కాకుండా దేశాన్ని శక్తివంతం చేయడంలో చురుకైన పాత్ర వహించిన గొప్ప నాయకుడు భారత ప్రథాని మోడీ.  చైనాకి చెక్ పెట్టినా, పాకిస్తాన్ వెన్నులో చలి పుట్టించినా కాశ్మీర్ సమస్యకు పరిష్కారం చూపినా అది మోడీ గొప్పతనమే. అమిత్ షా వంటి నేతలు ఆతని ఆశయ సిద్ధికి ఎంతగానో తోడ్పడ్డారు.  అతను భారత దేశాన్ని స్వయం సమృద్ధి గల దేశంగా తీర్చి సిద్ధేందుకు తీసుకుంటున్న నిర్ణయాలకు. దేశ ప్రజల సహకారం ఎంతో అవసరం. అవినీతి రహిత పాలన అందించడంలో అయన చేస్తున్న కృషి గొప్పది.  ప్రతిపక్ష పార్టీల ఆరోపణలను పట్టుకు వ్రేలాడకుండా తాను ఏమేమి చేయాలనుకున్నాడో చేసుకుంటూ పోతున్న కర్మయోగి.  మేక్  ఇండియా నుండి మేక్  ఫర్ ది వరల్డ్ నినాదం వరకూ  అగ్గిపోకుండా ప్రజలను అందులో భాగస్వాములు అయ్యేందుకు స్వాగతిస్తూ ఆగస్టు 15 న జండా వందనం రోజున చేసిన ప్రసంగం అద్భుతం.  తన ప్రసంగం ఆద్యంతం ఎక్కడా తన పేరు  చెప్పుకోకుండా, తన పార్టీ పేరు గానీ పార్టీ పెద్దల పేరుగానీ ప్రస్తావించకుండా భారత్  అన...

మరణ భయంతో మానవ సంబంధాలు

Image
  ఎన్నో ఆశలు, అనుబంధాలూ పెంచుకుని, సుఖ సంతోషాలతో ఉండే అనేక మధ్యతరగతి కుటుంబాలు, కష్టపడి ఉన్నత శిఖరాలు చేరుకుని అగాథాల లోతుల జారుతున్న విజేతలు, మనిషిని మనిషి చూస్తేనే భయపడి అనుమానంగా చూసే రోజులు. కరోనా మార్చేసింది సామాజిక చిత్రపటాన్ని. కరోనా శాసిస్తోంది ఓ మనిషీ మనిషిగా బ్రతకమని. కరోనా బోధిస్తోంది భూమికి మనిషి కేవలం ఒక అతిథి మాత్రమేనని. ఆడంబరాలకు, వైభవ ప్రదర్శనకూ, విలాసాలకూ చెక్ పెడుతూ... తస్మాత్ జాగ్రత్త బయటకు వెళ్తే బలౌతావ్, బయటవారిని నీ ఇంటికి పిలిచినా బలౌతావ్! బ్రతకాలంటే బంధాలు వేసుకో అని హెచ్చరిస్తోంది కరోనా! హెచ్చరికలు పెడచెవిన పెడితే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. మహా నాయకుడైనా, మహా భక్తుడైనా, ధర్మాత్ముడైనా, మహాత్ముడైనా, ధనవంతుడైనా, నిరుపేద అయినా, మతం ఏదైనా, కులం ఏదైనా కరోనాకి ఒక్కటే మనిషిని వదిలేది లేదంటూ సవాల్ విసిరింది. రానంత వరకూ రాజాలా తిరిగే జనం, కరోనా సోకగానే కలతపడుతున్నారు. రోజుకి రెండు లక్షలు గుంజుతూ చచ్చాక బిల్లు కట్టించుకుని తగలెట్టే కార్పొరేట్ హాస్పిటల్స్ వికృత రూపం వికటం కనిపిస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రులంటే రోగులు భయపడిపోతూ ప్రైవేటు కి పరుగుతీసి ఛిద్రమైపోతున్నారు...

ఎలా ఎదుర్కోవాలి? ఏది దారి?

Image
కరోనా కమ్యూనిటీ స్ప్రెడ్ దశలో ఉంది. చాలామంది కరోనా బారిన పడుతున్నారు. ఎవరు ఎప్పుడు ఎఫెక్ట్ అవుతారో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. దీనికి వాక్సిన్ గానీ మందుగానీ ఇంకా సిద్ధం కాలేదు. ప్రివెన్షన్ బెటర్ దన్ క్యూర్ అన్నారు పెద్దలు. కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనంత వరకూ ఇంట్లోనే ఉండాలి. ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్ళకపోయినా, బయట వారిని ఇంట్లోకి ఆహ్వానించకూడదు. ఒకవేళ బయటవారు ఇంట్లోకి రావాల్సి వేస్తే వాళ్ళు ముందుగా కాళ్ళు కడుక్కుని మాస్క్ ధరించాలి లోపలికి రావాలి. వాళ్ళు ఎటువంటి సింటమ్స్ లేకుండా ఉండాలి. వారికి మనం ఆరు అడుగుల దూరంలో ఉండాలి. వారు వెళ్ళినవెంటనే గాలిలో ఎయిర్ సేనిటైజర్ ని వాడాలి. ఇక ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్ళి వచ్చినట్లయితే. బయటికి వెళ్ళేటప్పుడు మాస్కు ధరించాలి దానిని ఎట్టి పరిస్థితిలోనూ తీసి నలుగురిలో తిరగకూడదు. ఏది టచ్ చేసినా ఆ పని పూర్తయ్యాక సేనిటైజ్ చేసుకోవాలి. అంటే ఎక్కడికి వెళ్ళినా, మన వద్ద సేనిటైజర్ సిద్ధంగా ఉంచుకోవాలి. తిరిగి ఇంటికి వచ్చాక ఆ మాస్కుని వెంటనే తీసి అది డిస్పోజబుల్ అయితే డస్ట్ బిన్ లో వేయాలి లేదా క్లాత్ అయితే వాష్ చేసి ఆరబెట్టాలి. బయటకు వెళ్ళి వచ్చిన ...

ఇక నుంచి దేశవ్యాప్తంగా 5+3+3+4 విద్యా విధానం

Image
దేశవ్యాప్తంగా ఎడ్యుకేషన్  సిస్టం లో అనేక మార్పులకు కేంద్రం సంకల్పించింది . ఈ  నూతన జాతీయ విద్యా విధానానికి కేంద్ర కేబినెట్ లో ఆమోదం లభించింది.   విద్యా రంగంలో కీలక మార్పులు చేస్తూ డాక్టర్ కస్తూరి రంగన్ కమిటీ రూపొందించిన జాతీయ నూతన విద్యా విధానాన్ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఈ మేరకు  కేంద్రం మానవ వనరుల అభివృద్ధి శాఖ పేరును విద్యా మంత్రిత్వ శాఖగా మార్పు చేసింది.  ఉన్నత విద్యలో కీలక సంస్కరణలను చేసింది మోడీ ప్రభుత్వం . 2030 సంవత్సరం నాటికి దేశంలో అందరికీ విద్య అందించడమే ప్రధాన లక్ష్యం. ఇకపై ఆర్ట్సు , సైన్సు ‌ కోర్సుల విద్యా బోధనలో పెద్దగా తేడాలు ఉండవు. బహుభాషల బోధన దిశగా నూతన విద్యా విధానం ఉండబోతోంది. 1. కీలక సంస్కరణలు ఇవే: 2. మూడు నుంచి 18 ఏళ్ల వరకు అందరికీ విద్య తప్పనిసరి 3. 2030 నాటికి అందరికీ విద్య అందించడమే లక్ష్యం 4. ఆరు తరగతి నుంచి కోడింగ్, ప్రోగ్రామింగ్ కరిక్యులమ్ 5. 6వ తరగతి నుంచి వొకేషనల్ ఇంటిగ్రేషన్ కోర్సులు 6. ఇంటర్ విద్య ఉండదు 7. ఇంటిగ్రేటెడ్ పీజీ, యూజీ విద్య ఐదేళ్లు 8. దేశవ్యాప్తంగా ప్రాథమిక విద్యకు ఒకటే కరిక్యులమ్ 9. పాఠ్యాంశాల భారం తగ్గించ...

రాఫెల్ యుద్ధ విమానాలు కొనడం అవసరమా? కాదా?

Image
రాఫెల్ యుద్ధ విమానాలు కొనడం అవసరమా? అనే ప్రశ్నకు జవాబు వెదికే ముందు అసలు రాఫెల్ గురించిన వివరాలు చూద్దాం.  రాఫెల్ డస్సాల్డ్ ఏవియేషన్ వారిచే తయారు చేయబడిన ట్విన్ జెట్ ఇంజెన్ యుద్ధ విమానం.  ఇది షార్ట్ అండ్ లాంగ్ (తక్కువ మరియు సుదూర) లక్ష్యాలను చేధించగల టెక్నాలజీ తో రూపొందించబడింది.  భూ దాడులు సముద్ర దాడులు, అను క్షిపణి దాడులను సైతం నిరోధించగల శక్తి వీటి సొంతం. తొలుత ఈ విమానాలు ఫ్రెంచి నావికాదళం కోసం అభివృద్ధి చేయబడ్డాయి.  ఇవి ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్, మాలి, లిబియా, సిరియా మరియు ఇరాక్ దేశాల పైన యుద్ధ కార్యాలకై వినియోగించ బడ్డాయి.  వీటిని మన దేశం తో పాటూ ఈజిప్టు, ఖతార్ కూడా కొనుగోలు చేశాయి.  భారత దేశం 36 రాఫెల్ యుద్ధ విమానాలకు 2015 న మోడీ ఫ్రాన్సు పర్యటన సందర్భంలో 53,000 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది.  చైనా తో భారత్ కు జరుగుతున్న  సరిహద్దు వివాదాల సమయంలో అనుకున్న దానికంటే ముందరే 5 రాఫెల్ యుద్ధ విమానాలు భారత్ కి జులై 27 న చేరడం హర్షించ దాగిన పరిణామం.  ఈ క్షిపణులతో 100కిమి నుండి 600కిలోమీటర్ల వరకూ  ఉన్న లక్ష్యాలను సునాయాసంగా భారత గగనతలం దాటకుండ...