గణేశా టూ భూ లోకమ్! కానీ ఇది కరోనా టైమ్!!
గణపతి : మాతా పితరులకు అభివందనాలు.
పార్వతీదేవి : నాయనా ఎక్కడకి ఇంతలా ముస్తాబు అయ్యావు?
గణపతి : మీకు తేలియానిది ఏమున్నది మాతా ! ప్రతి సంవత్సరము లాగే ఈ సంవత్సరము కూడా నేను నా పుట్టినదినము భూలోకమునకు ఏగుచున్నాను.
శివుడు : నాయనా ప్రతి సంవత్సరమూ వెళ్ళుచుంటివి కదా. ఈ స్సంవత్సరము మానుము.
గణపతి : అదేమీ తండ్రీ! నేను వెళ్ళుటకు ఏమి ఆటంకము ?
శివుడు : కలి వశంబున భూలోకమున ఈ సంవత్సమున కరోనా కంటకుడు సంచరించు చున్నాడు. వాడు ఎవని నేని తాకేనేని నాసికా రంధ్రములలోకి పోయి తీవ్రమైన అనారోగ్యము కలిగించును.
గణపతి : తండ్రీ! నేను మీ కుమారుడును. భయమెరుగని బ్లడ్డు నాది. నాకు కూడా హాని జరుగునా? దేవలోకం లోనే మనది మెగా ఫామిలీ.
పార్వతీదేవి : నాయనా ఆ ఇంగ్లీషు పదములు మనుము . కనీసం మాముందర నైననూ స్వచ్ఛమైన భారతీయ భాషలో ఉఛ్చరించుము.
గణపతి : మన్నించుము మాతా ! ప్రతీ సంవత్సరమూ తొమ్మిది నుండి పదిహేను దినములు భూలోకమున ఉందును కదా ! పదములు అనుకోకుండానే ఉచ్ఛరించ బడుచుండెను. అదియునూ కాక ఇప్పుడు ప్రపంచమంతటనూ నాకు గుళ్ళూ గోపురములను మానవులు కట్టించి కొలుచు చున్నారు. ఆ సాంగత్యమున నాకు ప్రపంచ భాషలు కూడా అలవడుచున్నవి.
శివుడు : నాయనా! నీవు భూలోకమున వెళ్లిన నీకు హాని కలుగునను భయము మాకు లేదు. ఎందుకంటే నీవు గజాననుడవు. కరోనా కంటకుడు. మానవులను మాత్రమే ఆవహించి సంహరించును. కానీ...
గణపతి : కానీ ఏమిటి తండ్రీ?
శివుడు : నీకు హాని కలుగకున్ననూ నీ కారణమున నీనుండి అతడు ఇతరులను ఆవహించ గలడు.
గణపతి : అటులైన అతడిని నా తొండముతో పీల్చి సంహరించెదను!
పార్వతీ దేవి : నాయనా! త్రిశూల ధారి అయిన మీ తండ్రిగారు ఆ పని చేయలేరనుకొందువా? కరోనా కంటకుడు ఎవ్వరో కాదు శివాజ్ఞ తో భూ లోకమున జన్మించినవాడు.
గణపతి : అదేమి మాతా ? లోక కంటకుడికి తండ్రి వలన జన్మమా?
పార్వతీ దేవి : అవును నాయనా! భూలోకమున మానవుని వలన ఇతర ప్రాణ కోటికి అన్యాయము జరుగుచున్నది. విష వాయువులు ప్రభలు చున్నవి. జంతు జాలములు హింసకు గురవుచున్నవి. మానవులు అవసరమున్ననూ లేకున్ననూ జంతు జాతులనూ పక్షి జాతులనూ సంహరించి తినుచున్నారు.
శివుడు : మన కైలాసమునకు ఆవలి వైపున ఉన్న చైనీయులు మరింత శృతిమించి భుజించు చున్నారు. వీరు పూర్తిగా నాస్తికులు. ఎటువంటి ఆధ్యాత్మిక భావములూ లేనివారు. మూర్ఖ మానవులు. దైవమన్న ఏమాత్రమూ భక్తి ల్లేని వారు.
గణపతి : మరి వారిని క్షమించెదవేల తండ్రీ! శిక్షించవచ్చును కదా?
శివుడు : అది మన పరిధిలో లేదు నాయనా! జగన్మాతకు అందరూ బిడ్డలే! కనుక వారి పాపములను బట్టి వారికి ఫలితములు ఉండును.
గణపతి : అంటే మనము' మన సృష్టి రాజ్యాంగము ప్రకారమూ నడచుకొన వలెనా? మరి జంతు జాలములను రక్షించుట మన బాధ్యత కదా?
శివుడు : కాదు నాయనా దీవించుటే మన బాధ్యత! అవి పుణ్యము చేసుకొనిన యెడల వాటిని రక్షించుటకు మనకు చట్టములు అనుమతించును.
గణపతి : అటులైన ఇప్పుడు నేను ఏమి చేయవలెను? భూలోకమునకు వెళ్ళుటకు ఆల్రెడీ నాకు షెడ్యూల్సు ఖరారైనవి కదా?
శివుడు : నీవు వెళ్ళిననూ మాస్కు ధరించవలెను! భౌతిక దూరము పాటించవలెను! దేనిని స్పృశించిననూ హస్తములను శుద్ధి చేసుకొనవలెను. తిరిగి ఇచ్చటకు వచ్చిననూ పదునాలుగు దినములు ఏకాంతముగా ఉండవలెను. మన ప్రమథ గుణములను గానీ, మునులను గానీ కలవారాదూ , వారితో ఎటువంటి సంభాషణలూ చేయరాదు! దీనికి నీకు సమ్మతమైనచో నిస్సందేహముగా వెళ్లవచ్చును!
గణపతి : తండ్రీ! మానవులై ఉండి వారే చేయగా లేనిది నేను ఎందుకు చేయలేను? నేను కూడా వారి వాలే అన్ని నియమములూ పాటించుచూ నా భూలోక యాత్ర ముగించుకుని ఈచటకు వచ్చి స్వీయ గృహ నిర్బంధినై ఉందును!
పార్వతీ దేవి : నాయనా గణేషా ! పుత్రవాత్సల్యము చేత మేము నిన్ను వారించుచుంటిమి గానీ నీ నిష్ఠ తెలియక కాదు. వెళ్లి రా నాయనా!
గణపతి : ఆజ్ఞ మాతా! ఆజ్ఞ తండ్రీ! చిటికెలో వెళ్లి చిటికెలో వచ్చెదను.
😃😃😃😃😃😃😃😃

Comments
Post a Comment