అతనొక అనితర సాధ్యం


సామాన్యుడిగా జీవితం ప్రారంభించి నమ్మిన ఆశయాలకు కట్టుబడి, అంచెలంచెలుగా ఎదిగి, కర్తవ్యమే దీక్షగా పార్టీని ముందుకు నడిపించడమే కాకుండా దేశాన్ని శక్తివంతం చేయడంలో చురుకైన పాత్ర వహించిన గొప్ప నాయకుడు భారత ప్రథాని మోడీ. 

చైనాకి చెక్ పెట్టినా, పాకిస్తాన్ వెన్నులో చలి పుట్టించినా కాశ్మీర్ సమస్యకు పరిష్కారం చూపినా అది మోడీ గొప్పతనమే. అమిత్ షా వంటి నేతలు ఆతని ఆశయ సిద్ధికి ఎంతగానో తోడ్పడ్డారు. 

అతను భారత దేశాన్ని స్వయం సమృద్ధి గల దేశంగా తీర్చి సిద్ధేందుకు తీసుకుంటున్న నిర్ణయాలకు. దేశ ప్రజల సహకారం ఎంతో అవసరం. అవినీతి రహిత పాలన అందించడంలో అయన చేస్తున్న కృషి గొప్పది. 

ప్రతిపక్ష పార్టీల ఆరోపణలను పట్టుకు వ్రేలాడకుండా తాను ఏమేమి చేయాలనుకున్నాడో చేసుకుంటూ పోతున్న కర్మయోగి. 

మేక్  ఇండియా నుండి మేక్  ఫర్ ది వరల్డ్ నినాదం వరకూ  అగ్గిపోకుండా ప్రజలను అందులో భాగస్వాములు అయ్యేందుకు స్వాగతిస్తూ ఆగస్టు 15 న జండా వందనం రోజున చేసిన ప్రసంగం అద్భుతం. 

తన ప్రసంగం ఆద్యంతం ఎక్కడా తన పేరు  చెప్పుకోకుండా, తన పార్టీ పేరు గానీ పార్టీ పెద్దల పేరుగానీ ప్రస్తావించకుండా భారత్  అని దేశం పేరును ప్రస్తావిస్తూ ప్రసంగం చేయడం శ్లేఘనీయం. అది గొప్ప సంప్రదాయం. 

అంతే కాదు ఈ ప్రసంగంలో ప్రతి పక్షాలపై ఎటువంటి విసుర్లూ లేకుండా రాష్ట్రాల రాజకీయాల జోలికి పోకుండా కేవలం ప్రభుత్వం అందిస్తున్న పడ్తాకాలు ప్రజలకు చేరేందుకు చేస్తున్న కృషిని, వాటిని ప్రజలు ఉపయోగించుకోవాలని చెబుతూ భవిష్యత్తులో చేయబోయే వాటిని క్లుప్తంగా వివరిస్తూ వన్ నేషన్ వన్ కార్డ్, మేక్ ఫర్ ది ఇండియా నుండి మేక్ ఫర్ ది వరల్డ్ వంటి సందేశాలు చెప్పడం జరిగింది. 

చైనా ఉత్పత్తుల పై ఆధారపడి ఉండటం వలన మన దేశంలో స్కిల్ డెవలప్మెంట్ నిద్రపోతోందని. అందువలన చైనా ఉత్పత్తుల వాడకం వదిలిపెట్టి మనదేశపు ఉత్పత్తులను పెంచుకునే విథంగా చతన్యవంతం చేసి దిగుమతులకు బదులు ఎగుమతులు పెంచుకుని  దేశీయంగా క్రియేటివిటీ ని ప్రోత్సహించి మంచి ఉత్పత్తులు సాథిచడం  అవసరమని ఎర్రకోట పై జెండా ఎగుర వేసి చెప్పడం హర్షించ దగిన చర్య.  

రానున్న రోజులలో కరోనా పట్ల జాగ్రత్తలు పాటిస్తూ దేశాన్ని ముందుకు నడపడంలో ప్రజల భాగస్వామ్యం అవసరమని, పన్నుల విథానం లో కూడా కొన్ని మార్పులు చేస్తూ దేశంలో అందరూ పన్నులు కట్టే విషయంలో ముందుకురావాలని దానికి మార్గదర్శకాలను సులభతరం చేస్తున్నట్లు, పన్నులు కట్టేవారికి ప్రాధాన్యత ఉండాలని చెప్పడం మెచ్చుఁకో దగిన సందేశం. 

చిత్రమైన విషయం ఏమిటంటే ఈ ప్రసంగంలో అయోథ్య రామ మందిర నిర్మాణం పై ఎటువంటి ప్రస్థావన చేయకపోవడం. 

భవిష్యత్తులో ఇదేవిధమైన మార్గాన్ని అనుసరిస్తూ దేశాన్ని ముందుకు నడిపేందుకు మోడీ కి శక్తి లభించాలని కోరుకుంటూ....

అతనొక అనితర సాధ్యం!

అతనొక ఆగని కెరటం!

అతనొక సత్యపు మకుటం!

అతనొక సాగే సమరం!

అతనొక భారత కిరణం!

అతనే భారత ప్రథాని మోడీ!

అతనే భారత కీర్తికి నాడి!  

Photos:

  • Narendra Modi
  • Narendra Modi
  • Narendra Modi
  • Independence Day 2020
  • Independence Day 2020
  • Indipendence Day
  • Independence Day
  • Independence Day 2020
  • Narendra Modi
  • Independence Day 2020
  • Independence Day
  • Narendra Modi

Comments

Popular posts from this blog

రాఫెల్ యుద్ధ విమానాలు కొనడం అవసరమా? కాదా?

నువ్వే దేవుడివి అయితే దేవుడే నీ వాడు - కథ

ది స్మోక్! ఎవరైనా చూసారా? - సీరియల్ స్టోరీ -పార్ట్ 1

ది స్మోక్! ఎవరైనా చూసారా? - సీరియల్ స్టోరీ -పార్ట్ 2

అపాత్ర దానమా ? స్పందించే హృదయమా ?

ఇక నుంచి దేశవ్యాప్తంగా 5+3+3+4 విద్యా విధానం

సందిట్లో సడేమియా! వరుణదేవుడు వచ్చెనయా!

ఎలా ఎదుర్కోవాలి? ఏది దారి?

గణేశా టూ భూ లోకమ్! కానీ ఇది కరోనా టైమ్!!