ది స్మోక్! ఎవరైనా చూసారా? - సీరియల్ స్టోరీ -పార్ట్ 2


జరిగిన కథ: సీరియల్ మర్డర్ కేసులో ఐదవ కేసును ఇన్వెస్టిగేషన్ చేయడానికి వెళ్తాడు వర్మ. సీసీ కెమెరాలను చెక్ చేస్తారు. కానీ అవసరమైన చోట కెమెరాలు లేక పోవడం వలన నేరస్తులను గుర్తించలేకపోతాడు వర్మ. ఇంతలో ఒక ఇంటి యజమాని తనకు చిన్న క్లూ ఇస్తాడు. 


మీడియా వాళ్ళు వర్మను చుట్టుముట్టారు. అంతా గోల గోల గా ఉంది. వాళ్ళ నుండి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచించుకునే లోపే వర్మను చుట్టుముట్టారు 


హలో సార్. ఈ హత్య ఎలా జరిగింది? ఎవరు చేసి ఉంటారు? గతంలో జరిగిన హత్యల విషయం ఇంకా దర్యాప్తులో ఉండగానే మరో హత్య జరిగింది. మీ ప్లాన్ అఫ్ ఏక్షన్ ఏమిటి ? సిటీ లో జనం భయాందోళనల తో ఉన్నారు. వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు?... గుక్క తిప్పుకోకుండా అడిగాడు ఒక ఛానెల్ ప్రతినిధి. 


హంతకులను త్వరలోనే పట్టుకుంటాం. ప్రజలెవ్వరూ భయపడ వలసిన అవసరం లేదు. సినిమా స్టైల్ లో ఆన్సర్ ఇచ్చాడు వర్మ. 


ఇంకెన్నాళ్లు సార్? హంతకుడు స్వేచ్ఛగా తిరుగుతూ ఒకటి తర్వాత ఒకటి చేస్తున్నాడు. మీరు మాత్రం వస్తారు వెళ్తారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఫెయిల్ అయ్యిందని జనం అనుకుంటున్నారు. అన్నాడు మరో విలేఖరి. 


జనం అనుకుంటున్నారా మీరు అంటున్నారా? ఎదురు ప్రశ్నించాడు కోపంగా వర్మ. 


దర్యాప్తు జరుగుతోంది. ఇప్పుడు మేము ఏమైనా లీక్ చేస్తే నేరస్తుడు అలెర్ట్ అవుతాడు. మేం ప్రొసీజర్ ప్రకారం ముందుకు వెళ్తాం. మా దర్యాప్తు ఒక కొలిక్కి వచ్చాక మేమే మీకు వివరాలు అందిస్తాం. అంతవరకూ మాకు కోపరేట్ చెయ్యండి. ప్లీజ్! అన్నాడు వర్మ. 


ఇంకా వాళ్ళు ఏదో అడగబోతుంటే వాళ్ల మధ్య నుండి దారి చేసుకుంటూ కార్ దగ్గరకి వెళ్లారు వర్మ, రాజు. 


రాజు కార్ స్టార్ట్ చేసాడు. 


ఫోన్ రింగ్ అవుతోంది. విజయ్ లైన్లో ఉన్నాడు. విజయ్ క్రైమ్ బ్రాంచ్ డిపార్ట్మెంట్ కోఆర్డినేటర్. 


హాయ్ విజయ్! మాకు ఒక చిన్న క్లూ దొరికింది. కానకారావ్ టీమ్ సాంపిల్సు శేకరిస్తున్నారు. మనం సాయంత్రం మీటవుదాం. ఈలోపు మాకు మరో చిన్న పని ఉంది.  డిస్కనెక్ట్ చేసాడు వర్మ. 


రాజూ ! మనం ఇంతకు ముందు హత్యలు జరిగిన ప్రదేశాలకి వెళ్దాం మనకి అక్కడ కూడా ఏదైనా క్లూ దొరకచ్చు . 


ఆ హౌస్ ఓనర్  చెప్పింది ఒక్క సారి రివైజ్ చేసుకున్నాడు వర్మ.... 


సార్ నాపేరు రాజారావు. నిన్న రాత్రి నేను భోజనం చేశాక పడుకున్నాను. కానీ మధ్య రాత్రి ఎందుకో నిద్ర పట్టలేదు. చాలాసేపు నిద్రపోడానికి ట్రై చేసాను. కానీ లాభం లేకపోయింది.  ఒకటే కీచురాళ్ళ సౌండ్. ఫ్రిజ్ లోంచి వాటర్ బాటిల్ తెచ్చుకుని తాగుతూ బాల్కనీ లోకి వెళ్లాను. రాత్రి ఇంచుమించుగా రెండు గంటల సమయం కావస్తోంది. అమావాస్య చీకటి. మీరు చూస్తున్నారుగా ఇళ్ళు విసిరేసినట్లు ఉన్నాయి. రోడ్ మీద లైట్లు తప్ప ఇంకేమీ కనిపించటం లేదు ఆ సమయంలో. నేను కొంచెం కొంచెం వాటర్ సిప్ చేస్తూ ఆ రోడ్ వైపే చూస్తున్నాను. 


కొంతసేపటికి ఒక పెద్ద వేన్ వచ్చింది. చూడటానికి పాతదిలా ఉంది. కలర్ ముదురు ఆకుపచ్చ లో ఉందేమో కానీ రాత్రి లైటింగ్ లో నాకది నల్లగా కనిపించింది. 


అందులోనుంచి నాలుగు వ్యక్తులు దిగారు. వారి హెడ్సుని కవర్ చేసుకున్నరు అందరూ బ్లాక్ జెర్కిన్సు , జీన్సు వేసుకుని ఉన్నారు. 

వాళ్ళు అక్కడే రెండు నిమిషాలు కదలకుండా నించుని మాట్లాడుకుంటూ కనిపించారు. వారి నుండి కొంచెం పొగ వస్తోంది. సింగెర్ట్సు కాల్చుకుంటున్నారని అనుకున్నాను. కొంతసేపు గడిచాక ఆ పొగ ఇంకా ఎక్కుఅయింది. వాళ్ళు తలో దిక్కుకీ నడుచుకుంటూ వెళ్లారు. మా ఇంటివైపుకు కూడా వచ్చారు. బహుశా కరోనా డిసిన్ఫెక్ట్ కోసం ఏదో స్ప్రే చేతున్నారనుకుని లోపలి వెళ్లి మంచం మీద వాలాను. చాలా మత్తుగా నిద్రవచ్చేసింది. మళ్ళా మార్నింగ్ తొమ్మిది గంటల వరకూ లేవలేదు.  చెప్పడం ముగించి వర్మ కళ్ళలోకి చూసి బహుశా ఆ ఘటనకీ ఆ యింట్లో జరిగిన దానికీ ఏదైనా రేలషన్ ఉందేమోనని నా అనుమానం. మీకు చెప్తే ఉపయోగం ఉంటుందని చెబుతున్నాను. అన్నాడు ఆ హౌస్ ఓనర్. 


వర్మ కి ఎగిరి గంతేసినంత పనయింది. థాంక్యూ మీరు ఈ విషయం చెప్పి చాల హెల్ప్ చేశారు. నేను మిమ్మల్ని అవసరమైతే మళ్ళీ కలుస్తాను. అంటూ భుజం మీద చెయ్యి వేసి బయటకి వచ్చాడు వర్మ. 


విజయ్ ని కలిసేలోపు మనం ఇంకా కొంత సమాచారం దొరుకుతుందేమో చూద్దాం అనుకుంటూ ఊపిరి గాఢంగా పీలుచుకున్నాడు. 


కారు క్రిస్టియన్సు కాలనీ వైపు టర్నింగ్ తీసుకుంది. 


****

అక్కడ చాలా సైలెంట్ గా ఎవరి పనులలో వాళ్ళు ఉన్నారు. వర్మా రాజులని చూడగానే కనకారావు హాయ్ అంటూ విష్ చేసి వాళ్ళని తన చాంబర్ లోనికి తీసుకు వెళ్ళాడు. 


వర్మా... ఇప్పటి వరకూ జరిగిన ఐదు హత్యలూ నిజానికి హత్యలు కావు. అవి ఎక్కడో మార్చురీ నుండి గానీ లేదా మరే ఇతర స్థలాలనుండి గాని సేకరించి తెచ్చిన శవాలు. ఇంతకు ముందు కూడా నీకు ఈ విషయం చెప్పాను. ఇప్పుడు కంఫార్ముగా మళ్ళీ చెబుతున్నాను. ఇవి హత్యకు సంబందించిన శవాలు కావు. ఇవి సహజంగా చనిపోయిన వారి మృత దేహాలు. వీటికి కొన్ని గాయాలు చేసి వేరే జంతువుల రక్తమూ మాంసమూ అద్దారు. సినిమాలలో చూపిస్తారుగా... సరిగ్గా అలాగే. బహుశా వీరిలో ఎవరో సినిమా మెకప్ ఎక్స్పర్ట్ ఉండి ఉండాలి.  

నీకు ఏమనిపిస్తోంది? అడిగాడు కనకారావ్ . 


నిజమే. అసలు వ్యక్తులను కిడ్నాప్ చేసి ఇలా శవాలను పెట్టడం వెనుక ఎదో గూడుపుఠాణీ ఉండి ఉండాలి. తలూపుతూ అన్నాడు వర్మ. 


ఇదిగో నా రిపోర్ట్సు.  అంటూ చేతికి ఇచ్చాడు కనకారావు. 


థాంక్యూ . ఈ రోజు అఫీసియల్సుకి స్టేటస్ అప్డేట్ చేయవలసి వుంది. ఇకపై ఈ కేసుని స్మోక్ యాంగిల్ లో ఇన్వెస్టిగేట్ చేయవలసి ఉంది. అన్నాడు వర్మ. బరువుగా నిట్టూర్పు విడుస్తూ... 

*****

అది పద్దెనిమిది  అంతస్తుల బిల్డింగ్. చాలా విలాసంగా అందంగా ఎత్తైన ప్రదేశంలో ఉంది మేఘాలను తాకుతూ.... ఆ పద్నాలుగవ అంతస్థులో ఏమి జరుగుతోందో ఎవ్వరికీ తెలీదు. అక్కడ నుండి చూస్తే సిటీ అంతా మ్యాప్ గీసినట్లు స్పష్టంగా కనిపిస్తుంది.  ఆ బిల్డింగ్ కాంపాస్ లోకి ఎవరు అడుగు పెట్టినా  లోపలి వారికి వెంటనే తెలిసిపోతుంది. టెర్రస్ పైనుండి చూస్తూ ఐసోలేటెడ్ గా విసిరేసినట్లు ఉన్న కాలనీలను ఫోటో తీసి మార్కు చేస్తున్నాడు వర్మ. 


విజయ్ వెనుక నుండి వచ్చాడు. ఏం చేస్తున్నావ్ వర్మ అని అడుగుతూ 


విజయ్...  మనకి ఒక తీగె దొరికింది. ఇంక డొంక కదల వలసి ఉంది.  క్లియర్ గా చెప్తాను విను. 


 సిటీ లో ఒక ముఠా తిరుగుతోంది. ఐసోలేటెడ్ గా ఉన్న కాలనీ ఇళ్లను టార్గెట్ చేస్తోంది. 


రాత్రి రెండు నుండి మూడు గంటల మధ్య ఒక పాత వన్ లో వచ్చి పొగని స్ప్రే చేస్తూ వాళ్ళు టార్గెట్ చేసిన ఇంటికి చేరుతారు. బహుశా వాళ్ళు ఆ పొగను పీల్చకుండా ఆక్సిజెన్ మాస్కులు ధరిస్తారేమో. కొంతసేపటికి చాలా  దట్టమైన పొగని రిలీస్ చేస్తారు. అప్పుడు ఆ పరిసర ప్రాంతాల వారికి అక్కడ ఏమి జరుగుతోందో అనుమానం కలిగే లోపే నిద్ర వస్తుంది. వెంటనే వాళ్లు టార్గెట్ చేసిన ఇంట్లోకి ఒక శవాన్ని తీసుకు వెళ్తారు. ఆ శవానికి అక్కడే హత్య జరిగినట్లుగా వేరే రక్త మాంసాలతో మేకప్ చేస్తారు. అలా చేయడం బహుశా మనల్ని వాళ్ల మెయిన్ క్రైం నుండి డైవర్ట్ చేసి శవాల చుట్టూ మన ఇన్విస్టుగేషన్ ని తిప్పడానికే. వాళ్ళు టార్గెట్ చేసిన వ్యక్తి ఆల్రెడీ నిద్రావస్థలోకి వెళ్ళిపోతుంది కనుక ఆ వ్యక్తిని సులభంగా వాన్లోకి షిఫ్ట్ చేస్తారు. 


ఇంకా ఏదో చెప్పబోతుండగా విజయ్ అడ్డు వచ్చాడు. మరి లోపల నుండి డోర్లు ఓపెను కాకుండా వాటిని బ్రేక్ చెయ్యకుండా లోపలి ఎలా వెళ్తారు?


నైస్ క్యూస్షన్ విజయ్. నాకు కూడా అదే డౌట్ మొదట వచ్చింది. కానీ అదేమీ పెద్ద విషయం కాదు. వాలు ఫుల్ వైక్వీప్మెంట్ తో వస్తారు. విండో గ్రిల్సు ఓపెన్ చేయడం, కిటికీ అద్దాలలో ఒకదానికి చిన్నగా కన్నం పెట్టి అందులోంచి తలుపుల గడియలు తీసి లోపలి ఎంటర్ అవుతారు. పని పూర్తి కాగానే అన్నీ యథాతథం గా ఫిక్సు చేస్తారు ఎక్కడా అనుమానం రాకుండా. బహుశా వాళ్లు అటాక్ చేయబోయే ఇంటిపై వాళ్లు ముందే రెక్కీ నిర్వహించుకుని ఉండాలి లేదంటే అంత ఈజీగా జరగదు.  


మరి వాళ్ళు బయటికి వెళ్లే తప్పుడు లోపల కిటికీ తలుపులకి గడియలు మళ్ళీ ఎలా పెడతారు. అడిగాడు విజయ్ మధ్యలోనే బ్రేక్ చేస్తూ. 


చాలా సింపుల్ విజయ్. లోపల కిటికీ తలుపులు గడియలు పెట్టి మెయిన్ తలుపులు  డోర్ లాక్ వి కనుక లోపలనుండి ఓపెన్ చేసుకుని తిరిగి క్లోజ్ చేస్తూ ఉంటారు. జెనెరల్ గా అలాంటి ఇళ్లలో ఆటోమాటిక్ డోర్ లాక్సే ఉంటాయి. ఒక వేళ అలా లేకపోయినా వాళ్లు టూల్సు ఎవైనా  ఉ యోగించి  టెక్నిక్ గా ఓపెన్ చేసుకుని బయటకు అనుమానం రాకుండా వెళ్ళిపోతారు. 


ఇంతకీ వీళ్లు ఇదంతా ఎందుకు చేస్తున్నట్లు? కొశ్చన్ మార్కు ఫేస్ పెట్టి అడిగాడు విజయ్. 


అదే మనం ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేయవలసి ఉంది. సరే పద కాంఫరెన్సు హాల్ కి వెళ్దాం. అక్కడ మనకోసం ఎదురుచూస్తుంటారు. అంటూ టెర్రస్ నుండి క్రింది ఫ్లోర్ కి బయలు దేరాడు వర్మ. 


**** 


అది ప్రెజెన్టేషన్ కాంఫరెన్సు రూమ్.  స్క్రీన్ మీద రెండు కాలమ్ లు కనిపిస్తున్నాయి. రూంలో అందరూ ఆ స్క్రీన్ వైపే చూస్తున్నారు.  వాళ్లలో ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన పెద్దలందరూ ఉన్నారు. వర్మ గొంతు సవరించుకున్నాడు. 


జెంటిల్ మెన్! ఈ కేసులన్నిటిలో హంతకుడు ఒక్కడే అని నా ఉద్దేశ్యం.  అతడు కొంతమంది గ్రూప్ తో కలసి ఈ నేరాలు చేసాడు. ఈ నేరాలలో కామం పోయింట్సుని చూసినట్లైతే... 


నంబర్ వన్.  హత్యలు జరిగిన ప్రదేశాలలో అసలు వ్యక్తులు కనిపించకుండా పోయి, వేరెవరివో  శవాలు ఉంటున్నాయి. మొదట్లో అవి మర్డర్ అయినట్లుగా అనుకున్నాం కానీ అవి మార్చురీల నుండి తెచ్చిన శవాలు. వాటిమీద ఉన్న రక్తం, ఇతర పార్టికల్సు ఆ శవాలవి కావు అని ఫోరెన్సిక్ రిపోర్ట్ వలన బయట పడింది. మిస్టర్ కనకారావ్ ఇంతకు ముందే ఆ విషయం కన్ఫర్ము చేయసారు. అందుకే వాటికి సంబంధించిన మిస్సింగ్ కేసులు ఏవీ నమోదు కాలేదు. అయితే ఆ శవాలు మన రాష్ట్రం లోనివా లేక ఇతర రాష్ట్రాలనుండి తీసుకు వచ్చినవా అనేది తేల్చవలసి ఉంది. 


నంబర్ టు. అసలు మిస్ అయిన వ్యక్తుల సమాచారం ఏదీ దొరకకుండా ... ఈ శవాల చుట్టూ మన దర్యాప్తు జరిగేలా ఆ నేరస్తుడు మనని డైవర్ట్ చేసాడు. 


నంబర్ త్రి. కనిపించకుండా పోయిన వ్యక్తుల కోసం ఎటువంటి డిమాండ్లూ  లేవు. కనుక నేరస్తుని ఉద్దశ్యం కిడ్నాప్ కాదు. వారిని హత్య చేసి ఉండాలి, లేదా మరేదైనా ప్రయోజనం కోసం వారిని వాడుకుంటూ ఉండాలి. 


మిస్సైన ప్రతీ చోటా స్మోక్ వచ్చేది అని మన పరిశోధనలో బయటపడింది. 


ఆ స్మోక్ రిలీజ్ కావడంతో పరిసరాలలోని వ్యక్తులు మత్తులోకి జారీ పోతారు. అది అబ్నార్మల్ అని కూడా భావించరు . నిద్రవచ్చింది పడుకున్నాం అనుకుంటారు.   అందువలన నేరస్తులు తమ పనిని చాలా సులభం గా చేసుకుని వెళ్లిపోతారు. బహుశా అందుకు వారు అనెస్తీషియా రిలేటెడ్ పదార్ధం గానీ, క్లోరోఫామ్ కి సంబంధించినది గానీ వాడి ఉంటారు. ఇదేమీ కొత్త కాదు. గతంలో కూడా అనేక నేరాలలో నేరస్తులు ఇటువంటివి వాడటం జరిగింది. 


నంబర్ ఫోర్ . నేరం జరిగిన ప్రదేశాలు సీసీ ఫూటేజి కి దొరకని చోట్ల మాత్రమే జరిగాయి. 


నంబర్ ఫైవ్.  మిస్సైన వారంతా ఆడవారు.   వీరంతా ఎక్కడో ఒక దగ్గర నేరస్తునికి సంబంధించి ఎదురైన వారై ఉండాలి. 


మనం ఇప్పుడు వారి పాస్ట్ మూమెంట్ స్టడీ చెయ్యాలి. గతం లో ఎక్కడైనా వీరంతా ఒక్క చోట కలసి ఉంటారా? 

కలసి ఉంటే ఆ సమయంలో  వీరిని కలసిన కామన్ వ్యక్తి ఎవరు? ఎక్కడుంటాడు? అతడికి సంబంధించిన ఆధారాలు సేకరించాలి. 


ఇక కేసుల లో సంబంధం లేని అంశాలు ఏమిటంటే.... 


వీరిలో ఎవ్వరూ ఒక డిపార్ట్మెంట్ కి చెందిన వారు కారు. ఒక స్టేటస్ కి సంబంధించిన వారు కారు. 


ఒకరు బిజినెస్ ఎంట్రప్రనర్, ఒకరు సాఫ్ట్ వేర్ ఇంజినీర్, ఒకరు డేటా అనలిస్ట్, ఒకరు ఆడిటర్, ఒకరు ఫార్మా సైన్టిస్ట్. 


అందరి వైపు చూస్తూ ఆగడు వర్మ. 


ఈ పరిశోధన ఇంకొంచెం డీప్ గా చేయవలసిన అవసరం ఉంది. నా అనుమానం నిజమైతే వీరంతా బ్రతికే ఉండాలి. బహుశా వీళ్లని  ఏదో ప్రమాదకరమైన సైన్టిఫిక్ ప్రాజెక్ట్ కి పని చేయడం కోసం రహస్యంగా తీసుకు వెళ్లి ఉండాలి.  వీళ్ళని త్వరలోనే రక్షించి తీరుతాం. 


వర్మ తన ప్రెజెన్టేషన్ ముగించాడు. సీనియర్ ఆఫీసర్లు అంతా వర్మ చెప్పినది చాలా కన్వీన్సుడు గా ఉన్నట్లు భావించి అప్రిసియేట్ చేశారు. గుడ్ జాబ్ వర్మా ! గో ఎహెడ్ అంటూ విష్ చేసాడు బ్రాంచ్ డైరెక్టర్. 


*****


సో మన తరువాతి యాక్షన్ ప్లాన్ ఏమిటి? అడిగాడు విజయ్. 


విజయ్  అన్ని  పోలీస్ స్టేషన్సు ని, చెక్ పోస్ట్సుని అలెర్ట్ చేయండి. పాత ఆకుపచ్చ వేన్ ఏది కనపడినా ఫాలో కమ్మనండి. కానీ ఒక్క విషయం వాళ్ళు మనల్ని గమనించకుండా ఫాలో కావాలి. వాళ్ళ మూమెంట్ లో ఏమాత్రం తేడా కనిపించి వేగం పెంచినా వెంటనే ఛేజ్ చేసి పట్టుకోవాలి.  మనకి ఆ వేన్ గురించి తెలిసిందన్న విషయం ఇంకా నేరస్తులకు తెలియదు. కనుక వాళ్లు స్వేచ్ఛగా తిరుగుతూ మరో నేరానికి ప్రయత్నిస్తారు.  చెప్పాడు వర్మ. 


*****


నల్లని నాగు పాములా ఉన్న పొడుగైన రోడ్ పై హెడ్ లైట్ల కాంతి తో  చీకటిని చీల్చుకుంటూ పోతోంది ఆకుపచ్చటి వేన్. సమయం సుమారు రాత్రి ఒకటిన్నర కావస్తోంది. హైదరాబాద్ సిటీకి దూరంగా చిమ్మ చీకటిలో అతి వేగంగా పోతోంది. దాని వెనుక పోలీస్ జీప్ వెంటాడుతోంది. 


*****


చెక్పోస్ట్ దగ్గర పోలీసులు అడ్డంగా నిల్చున్నారు. వారికి ముందుగా ఇన్ఫర్మేషన్ అందింది. దూరం నుండి వేగంగా వస్తున్న వేన్ చెక్ పోస్ట్ ని గమనించి  స్లో అయింది. ఒక పక్కకు తీసుకుని ఆగింది. పోలీసులు దాన్ని చుట్టుముట్టి సెర్చి చేశారు. అందులో మనుషులను కూడా స్కాన్ చేశారు. ఫోటోలు తీసుకున్నారు. వేన్ డిటైల్సు తీసుకుని ఫైల్ చేశారు. 


కొంత సేపు ఆగండి ఇన్స్పెక్టర్ సార్ వస్తున్నారు. అంటూ వాళ్ళను కంట్రోల్ లోకి తీసుకున్నారు. వాళ్ళ మొబైల్ ఫోన్సు తీసుకున్నారు. వాళ్ళ నుండి ఎటువంటి అభ్యంతరం గానీ ఎదురు దాడి గానీ లేదు. 


చెక్ పోస్ట్ దగ్గర ఎస్సై వర్మ రాక కోసం ఎదురు చూస్తున్నాడు.  ఇంతలో అక్కడికి ఒక నీలి మారుతి డిసైర్ కార్ వచ్చి ఆగింది. ఎస్సై లైసెన్సు చెక్ చేసి పంపేశాడు. దాని వెనకే వర్మ కార్ వచ్చి ఆగింది. కార్ సైడ్ చేసుకుని వర్మ, రాజూ దిగారు. వర్మ హడావిడిగా ఎస్సై దగ్గరకి వచ్చాడు. కొంతసేపు ఇద్దరూ ఏదో మాట్లాడుకున్నారు. 


ఇమ్మీడియట్ గా ఆ నలుగురినీ పోలీసులు చుట్టుముట్టి అరెస్ట్ చేసి పోలీస్ వెన్లోకి నెట్టారు. 


వర్మ, రాజూ  కార్ స్టార్ట్ చేశారు. వెనకాలే మరికొంత మంది పోలీసులు, ఎస్సై ఫాలో అయ్యారు. దూరంగా నీలి మారుతీ డిసైర్ కార్ కనిపిస్తోంది. మనం వాళ్లకు అనుమానం రాకుండా వెంబడించాలి అని పోలీసులకు ముందే వార్ణింగ్ ఇచ్చాడు వర్మ. అర. గంట డ్రైవ్ తరవాత ఒక వై జంక్షన్ వచ్చింది. 


డిసైర్ కార్ ఎడమ వైపు తిరిగింది. ఆ దారి కుడి వైపు దారి కన్నా సన్నగా వంకర టింకరలతో ఉంది.  కుడి వైపుది మెయిన్ రోడ్.


పోలీసులు కూడా ఎడమ వైపు  మళ్లించారు. కొంచెం దూరం వెళ్ళగానే డిసైర్ కార్ ఉన్నట్టుండి స్పీడ్ పెంచింది. 


పోలీసులు కూడా స్పీడ్ పెంచారు. ఎత్తు పల్లాల రోడ్ పై వాహనాలు ఎగిరి ఎగిరి పడుతూ వెళ్తున్నాయి. వాటి నుండి వచ్చే సౌండ్ భీభత్సంగా ఉంది. మరో అరగంట ఛేజింగ్ తర్వాత షడన్ గా దట్టమైన చెట్ల మధ్య నుండి రోడ్ మలుపు తీసుకుంది. కొంచెం ముందుకు వెళ్ళాక ఎదురుగా వెళ్తున్న కారు చీకటిలో మాయం అయింది. 


(పార్ట్-3 త్వరలో)  

 ఈ కథలోని పాత్రలూ, సన్నివేశాలూ కేవలం కల్పితం. ఎవరినీ ఉద్దేశించినవి కావు, ఎందునుండీ సేకరించినవి కావు. 

Comments

Popular posts from this blog

అతనొక అనితర సాధ్యం

రాఫెల్ యుద్ధ విమానాలు కొనడం అవసరమా? కాదా?

నువ్వే దేవుడివి అయితే దేవుడే నీ వాడు - కథ

ది స్మోక్! ఎవరైనా చూసారా? - సీరియల్ స్టోరీ -పార్ట్ 1

అపాత్ర దానమా ? స్పందించే హృదయమా ?

ఇక నుంచి దేశవ్యాప్తంగా 5+3+3+4 విద్యా విధానం

సందిట్లో సడేమియా! వరుణదేవుడు వచ్చెనయా!

ఎలా ఎదుర్కోవాలి? ఏది దారి?

గణేశా టూ భూ లోకమ్! కానీ ఇది కరోనా టైమ్!!