ఎలా ఎదుర్కోవాలి? ఏది దారి?


కరోనా కమ్యూనిటీ స్ప్రెడ్ దశలో ఉంది. చాలామంది కరోనా బారిన పడుతున్నారు. ఎవరు ఎప్పుడు ఎఫెక్ట్ అవుతారో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. దీనికి వాక్సిన్ గానీ మందుగానీ ఇంకా సిద్ధం కాలేదు.

ప్రివెన్షన్ బెటర్ దన్ క్యూర్ అన్నారు పెద్దలు. కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనంత వరకూ ఇంట్లోనే ఉండాలి. ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్ళకపోయినా, బయట వారిని ఇంట్లోకి ఆహ్వానించకూడదు. ఒకవేళ బయటవారు ఇంట్లోకి రావాల్సి వేస్తే వాళ్ళు ముందుగా కాళ్ళు కడుక్కుని మాస్క్ ధరించాలి లోపలికి రావాలి. వాళ్ళు ఎటువంటి సింటమ్స్ లేకుండా ఉండాలి. వారికి మనం ఆరు అడుగుల దూరంలో ఉండాలి. వారు వెళ్ళినవెంటనే గాలిలో ఎయిర్ సేనిటైజర్ ని వాడాలి.

ఇక ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్ళి వచ్చినట్లయితే. బయటికి వెళ్ళేటప్పుడు మాస్కు ధరించాలి దానిని ఎట్టి పరిస్థితిలోనూ తీసి నలుగురిలో తిరగకూడదు. ఏది టచ్ చేసినా ఆ పని పూర్తయ్యాక సేనిటైజ్ చేసుకోవాలి. అంటే ఎక్కడికి వెళ్ళినా, మన వద్ద సేనిటైజర్ సిద్ధంగా ఉంచుకోవాలి.

తిరిగి ఇంటికి వచ్చాక ఆ మాస్కుని వెంటనే తీసి అది డిస్పోజబుల్ అయితే డస్ట్ బిన్ లో వేయాలి లేదా క్లాత్ అయితే వాష్ చేసి ఆరబెట్టాలి. బయటకు వెళ్ళి వచ్చిన బట్టలను కూడా వెంటనే సర్ఫ్ లో నానబెట్టుకుని, తలి స్నానం చేయాలి. ఆడవారు బయటకు వెళ్ళే ప్రతిసారీ తల స్నానం కుదరదు కనుక బయటకు వెళ్ళే టప్పుడు తలకు ముడి వేసుకుని చుట్టూ క్లాత్ చుట్టుకోవాలి. ఆఫీస్ లలో పనిచేసేవారుకూడా హెడ్ కవర్ వాడుకుంటే మంచిది. బయటకు వెళ్ళేవారు వీలైనంత వరకూ చేతులను ముఖం మీద టచ్ చేయకుండా ఉండాలి. ఒకవేళ టచ్ చేయవలసి వస్తే చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి.

పిల్లలను బయటకు పంపకూడదు. బయట పిల్లలతో ఆడనీయకూడదు. వాళ్ళను ఇంట్లోనే ఆడించాలి. ఒకవేళ పిల్లలు బయట ఆడవలసి వస్తే పై నియమాలన్నీ వాళ్ళకీ మనకీ వర్తిస్తాయి.

సి విటమిన్, డి విటమిన్, పోషక విలువలు కలిగిన ఫుడ్ తీసుకుంటూ, శ్వాశకు, శుభ్రతకు కావలసిన అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ కరోనా సోకకుండా మన పనులు మనం చేసుకునే ప్రయత్నం చేయాలి.

ఇక ఖర్మకాలి సోకితే ఏం చేయాలి:
మనకు కరోనా లక్షణాలు కనిపించినట్లైతే. ఎవరినీ కలవకూడదు. మనం వస్తువులు, మనం త్రాగిన గ్లాసులు, ప్లేట్లు కూడా ఎవరినీ తాకనీయకుండా వీలైనంత వరకూ మనమే వాష్ చేసుకోవాలి. ఒకవేళ మనకి ఓపిక లేని పరిస్థితి ఉండి ఇంట్లో వారి సహాయం అవసరం అయితే వాళ్ళకి మనం దూరంగా మాస్కు వేసుకుని ఉండి, వారిని ఆవస్తువులు శుభ్రం చేసేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించమనాలి.

ఎక్కువ ఆందోళన పడకుండా డాక్టర్ ని సంప్రదించి వారి సూచనలు పాటించాలి. వ్యాధి సోకిన వారు. ఇంట్లోనే వేరే గదిలో ఉండి ఆ గదిలోకి ఇతరులను రానీయకూడదు. వెంటిలేషన్ ఆ గదిలో తప్పనిసరిగా ఉండాలి. గాలి, వెలుతురు ప్రసరించే గది ఉండాలి. వ్యాధి సోకిన వారు బయట తిరిగ కూడదు. ఎవరితోనూ కాంటాక్ట్ కాకూడదు.

కషాయాలు తాగినా, ఆవిరి పెట్టినా, అదే వైద్యమని అనుకోకుండా ఇమ్యూనిటీ సిస్టమ్ ని కంట్రోల్ లో ఉంచుకునేందుకు దగ్గరలో ఉన్న డాక్టర్ ని సంప్రదించి తగిన మందులు వాడుకోవాలి. స్వంత వైద్యం పనికిరాదు. ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకోవాలి. మనం ఆక్సిజన్ లెవెల్స్ పరీక్షించుకోవడానికి ఆక్సోమీటర్ ఇంట్లో ఉంచుకోవాలి. టెంపరేచర్ లెవెల్స్ కూడా గమనించుకోవాలి. ఆక్సిజన్ లెవెల్సు 94 కి పైన ఉన్నంతవరకూ ఆందోళన చెంది హాస్పిటల్స్ లో అడ్మిట్ కానవసరం లేదు.

ఇంట్లోనే ఉండి ఎవరికి వారు డాక్టర్ సూచనలు పాటించాలి. ఒకవేళ వ్యాధి తీవ్రత పెరిగి జ్వరం ఎక్కువై, ఊపిరి తీసుకోవడం కష్టం కావడం వంటి సమస్యలు వేస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రభుత్వ కరోనా సెంటర్ లో అడ్మిట్ కావాలి. బెడ్ లేదనో, డీసెంట్ గా లేదనో సౌకర్యాలు లేవనో ఆలోచిస్తూ ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్స్ తలుపు తట్టే ప్రయత్నం మంచిది కాదు.

ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ తొందరగా అడ్మిట్ చేసుకోవు. హాస్పిటల్స్ చుట్టూ తిరిగేసరికి పుణ్యకాలం గడిచిపోతుంది. తీవ్రత తక్కువగా ఉన్నపుడు స్వంత వాహనం ఉంటే మంచిదే. లేదంటే అంబులెన్స్ కొరకు సంప్రదించాలి. ఒకవేళ అందుబాటులో లేకుంటే ఆలస్యం చేయకుండా దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆరోగ్య శాఖను సంప్రదించి కరోనా ట్రీట్మెంట్ కేంద్రం చేరుకోవాలి. ఈ సందర్భంలో అనేక ఇబ్బందులు కలగవచ్చు. కానీ ఆందోళన చెందకుండా ధైర్యం చెప్పుకుంటు వైద్యం కోసం ప్రయత్నించాలి.

ఆందోళన వ్యాధిని మరింత పెంచే అవకాశం ఉంది. కనుక మనని మనం సముదాయించుకోవడం అవసరం. మధ్య తరగతివారు, ఉద్యోగస్తులు ముఖ్యంగా పరిసరాల గురించి ఆలోచించకుండా ప్రభుత్వ వైద్యాన్ని ఆశ్రయించడమే మంచిది. ప్రైవేట్ వైద్యం ఆర్థికంగా మనల్ని జీవితంలో కోలుకోలేని దెబ్బతీస్తుంది.

ఏదో అయిపోతుందని ఆందోళన పడవద్దు. ధైర్యంగా ఎదుర్కోండి. కరోనా పాజిటీవ్ వచ్చిన వారిలో 85% ఏ ఇబ్బందులూ లేకుండా కోలుకుంటారు. 10% కొంత ఇబ్బంది పడినా తగిన వైద్యం అందుకుంటే సేఫ్ గా ఇంటికి చేరుకుంటారు. 5% మంది వారి ఇమ్యూనిటీ లెవెల్స్ ను బట్టి, ఇతర అనారోగ్యాలు అంటే ఆస్తమా, కేన్సర్, హార్ట్ డిసీజెస్ ఉన్నవారు మాత్రం మంచి వైద్యం పొందే ప్రయత్నం చేయాలి.

జీవితం చాలా విలువైనది. ఇది కర్మభూమి‌. ఈ భూమి మీద పుట్టిన మనిషే కాదు. చెట్టూ, మొక్క, పురుగు, జంతువు ప్రతీ జీవికీ జీవిత పరమార్ధం ఉంటుంది. కర్తవ్యాలు ఉంటాయి. మన వలన పూర్తి కావలసినదేదో మనకి తెలియకుండానే ఉంటుంది. అది మనకి నిర్దేశించబడి ఉంటుంది. అంతిమ శ్వాశ వరకూ పోరాడాలి. మనో బలాన్ని పెంచుకోవాలి. మృత్యువు చివరి అంచు వరకూ వెళ్ళి సురక్షితులై బయటపడేవారు ఎందరో ఉన్నారు. కనుక నిరుత్సాహంతో అఘాయిత్యాలకు పాల్పడవద్దు. ఆల్ ఈజ్ వెల్ అనుకుంటూ ధైర్యాన్ని పెంచుకుంటూ పరిస్థితులను ఎదుర్కోండి!


ఈ పోస్టు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని క్రింద కామెంట్ బాక్సు లో తెలపండి. 

Comments

Popular posts from this blog

అతనొక అనితర సాధ్యం

రాఫెల్ యుద్ధ విమానాలు కొనడం అవసరమా? కాదా?

నువ్వే దేవుడివి అయితే దేవుడే నీ వాడు - కథ

ది స్మోక్! ఎవరైనా చూసారా? - సీరియల్ స్టోరీ -పార్ట్ 1

ది స్మోక్! ఎవరైనా చూసారా? - సీరియల్ స్టోరీ -పార్ట్ 2

అపాత్ర దానమా ? స్పందించే హృదయమా ?

ఇక నుంచి దేశవ్యాప్తంగా 5+3+3+4 విద్యా విధానం

సందిట్లో సడేమియా! వరుణదేవుడు వచ్చెనయా!

గణేశా టూ భూ లోకమ్! కానీ ఇది కరోనా టైమ్!!