సందిట్లో సడేమియా! వరుణదేవుడు వచ్చెనయా!
స్వర్గంలో:....
వాన దేవుడు: ఇంద్ర సార్! ఎందుకో కాల్ చేసారట?
ఇంద్రుడు: యస్ మిస్టర్ రెయిన్! ఇదిగో ఆర్డర్స్! నువ్వు వెంటనే భూలోకం వెళ్ళి డ్యూటీ చెయ్యాలి! అక్కడ జనం కరోనా కంటకాసురుడంటే భయంలేకుండా తిరుగుతున్నారట! వాళ్ళకి భయం అంటే ఏమిటో చూపించు! ఒక్కడు కూడా బైటికి రాకూడదు! ఇట్స్ మై ఆర్డర్!
వాన దేవుడు: యస్ బాస్! ఇప్పుడే వెళ్తా గొడుగులు చిల్లులు పడేలా వర్షం కురిపిస్తా! ఎవరూ బయటికి రాకుండా వరదలు పొంగిస్తా!
ఇంద్ర: సినిమా డైలాగులొద్దు! పని చూడు! నాకు వెంట వెంటనే రిపోర్టు పంపించు!
వాన దేవుడు: ఓకే! బట్ వన్ థింగ్! ఆ ఎయిర్ డిపార్ట్ మెంట్ హెడ్ మిస్టర్ వాయ్ కరోనాతో హేండ్సు కలిపాడని తెలుస్తోంది. నేను ఎంత కష్టపడి వాళ్ళని బయటికి రాకుండా చేసినా ఎయిర్ హెల్పుతో ఆ కరోనా గాడు ఇళ్ళల్లోకి స్ప్రెడ్ ఐతే ఐ కాంట్ మేనేజ్! నేనేమీ చేయలేను.
ఇంద్ర: హుమ్... నేను వాయూ సంగతి చూసుకుంటాను ఫస్ట్ నువ్వు వెళ్ళి నేను చెప్పింది చేయ్.
ఇండియాలో...
బ్రేకింగ్ న్యూస్! రానున్న నలభైఎంది గంటల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక! లోతట్టు ప్రాంతాల వాళ్ళని ఎత్తైన ప్రాంతాలకి తరలించేందుకు సహాయక చర్యలు ముమ్మరం! చిన్న బ్రేక్! చూస్తూనే ఉండండీ.... ఇరవైనాలుగు గంటలూ!
😝😜😝😜😝😜

Comments
Post a Comment