అపాత్ర దానమా ? స్పందించే హృదయమా ?
సాధారణంగా ఒకరి కష్టం చూసి స్పందించే వారిలో జాలి పడే వారు ఎందరు వున్నా ... తొంభయ్ శాతం మంది మనకెందుకులే అనుకునే వారే ఉంటారు. ఐదు శాతం మంది అన్నీ తెలుసుకొని సహాయం చెయ్యాలా వద్దా, అతడి కష్టం గురించిన వార్త ఎంత వరకు నిజం? సహాయం వృధా అవుతుందా? ప్రయోజనం వుంటుందా? అని పరిశీలించిన తరువాత గాని ముందుకు రారు.
కానీ ఒక అడుగు ముందుకేసి తక్షణ సహాయం చేసేవారు కొందరే ఉంటారు. అటువంటి వారిలో సోను సూద్ ఒకరు.
సోనూ సూద్ ముందు వెనకాలు ఆలోచించకుండా సహాయం చేస్తున్నాడనే విమర్శ చాల మంది చేస్తున్నారు. అది కొంత వరకు నిజం కావచ్ఛు. కానీ పూర్తిగా నిజం కాదు. అటువంటి విషయాలలో విమర్శలు సహాయం చేయాలనే స్ఫూర్తిని దెబ్బ తీస్తాయి.
ఒక వేళ అతను తొందర పడి సహాయం చేసి వున్నాడని అతను భావిస్తే అతనే దానిని సరిదిద్దు కుంటాడు. లేదా అతనే దాని ఫలితం అనుభవిస్తాడు. దాని వలన విమర్శించే వారికి వఛ్చిన నష్టం ఏమీ లేదు.
సమస్య ఎక్కడ వస్తోందీ అంటే ... అతన్ని దేవుడిని చేసి, ఇతర సెలెబ్రెటీలను తక్కువ చేసి సోషల్ మీడియాలలో చాలామంది నెటిజెన్లు పోస్టులు పెట్టడం వలన వారి ప్రతిష్ట దెబ్బ తింటోందని మరికొంత మంది భావించి సోనూ సూద్ సహాయం పై విమర్శలకు తెర దించుతున్నారు.
మానవత్వమే చచ్చిపోతున్న ఈ రోజుల్లో సోనూ సూద్ వంటి వారికి స్ఫూర్తి చాలా అవసరం. చిన్న చిన్న పొరపాట్లను చూసి చిల్లరగా కామెంట్ చేయడం మంచిది కాదు.
సహాయం చేయ గలిగితే చేయాలి, లేదా చేసే వారిని ప్రోత్సహించాలి. రెండూ చేయలేక పొతే మౌనంగా ఉండాలి.
చేతిలో సాధనాలు వున్నాయి కదా అని చెలరేగి పోయి విమర్శించడం సమంజసం కాదు.
ఒక వేళ రాజకీయ పార్టీ వ్యక్తి గా ఎవరైనా మంచి పనులు చేసినా , వారిని గుర్తించి అభినందించాలి. వ్యక్తులు చేసే దాన ధర్మాలను, బాధ్యతా యుతమైన పనులను రాజకీయ కోణంలో చూడ కూడదు. ఎందుకంటె వ్యక్తులు ఖర్చుపెట్టేది వారి స్వార్జితం లేదా పెద్దలనుండి సంక్రమించిన ఆస్తులు.
రాజకీయ సంస్థలు, ప్రభుత్వాలు, పార్టీ పేరు మీద ఏర్పాటు చేసుకున్న ప్రయివేటు ట్రస్టులు, ప్రజాధనం విరాళాల రూపం లో సేకరించి నడిపే చారిటబుల్ ట్రస్టులు ... వాటిని నడిపే వారు వారి ఖర్చులకు జవాబుదారులు. అటువంటి వారు ఏ సంక్షేమ పథకాలు గానీ , సహాయక చర్యలు గానీ చేసినా, వాటిలో పొరపాట్లు చేయకుండా ఉండాలి. ఒక వేళ పొరబడినా దానిని సరిదిద్దుకొని బాధ్యత వహించాలి.
ఏ నష్టమూ లేని వాళ్లు కామెంటు చేస్తున్నారు అంటే... కేవలం వినోదం కోసమే. తమ ఉనికిని చాటుకోవడం కోసమే!
ఈ పోస్టు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని క్రింద కామెంట్ బాక్సు లో తెలపండి.

Comments
Post a Comment