ఇక నుంచి దేశవ్యాప్తంగా 5+3+3+4 విద్యా విధానం


దేశవ్యాప్తంగా ఎడ్యుకేషన్  సిస్టం లో అనేక మార్పులకు కేంద్రం సంకల్పించింది . ఈ  నూతన జాతీయ విద్యా విధానానికి కేంద్ర కేబినెట్ లో ఆమోదం లభించింది.   విద్యా రంగంలో కీలక మార్పులు చేస్తూ డాక్టర్ కస్తూరి రంగన్ కమిటీ రూపొందించిన జాతీయ నూతన విద్యా విధానాన్ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఈ మేరకు  కేంద్రం మానవ వనరుల అభివృద్ధి శాఖ పేరును విద్యా మంత్రిత్వ శాఖగా మార్పు చేసింది. 

ఉన్నత విద్యలో కీలక సంస్కరణలను చేసింది మోడీ ప్రభుత్వం . 2030 సంవత్సరం నాటికి దేశంలో అందరికీ విద్య అందించడమే ప్రధాన లక్ష్యం. ఇకపై ఆర్ట్సు , సైన్సు ‌ కోర్సుల విద్యా బోధనలో పెద్దగా తేడాలు ఉండవు. బహుభాషల బోధన దిశగా నూతన విద్యా విధానం ఉండబోతోంది.

1. కీలక సంస్కరణలు ఇవే:
2. మూడు నుంచి 18 ఏళ్ల వరకు అందరికీ విద్య తప్పనిసరి
3. 2030 నాటికి అందరికీ విద్య అందించడమే లక్ష్యం
4. ఆరు తరగతి నుంచి కోడింగ్, ప్రోగ్రామింగ్ కరిక్యులమ్
5. 6వ తరగతి నుంచి వొకేషనల్ ఇంటిగ్రేషన్ కోర్సులు
6. ఇంటర్ విద్య ఉండదు
7. ఇంటిగ్రేటెడ్ పీజీ, యూజీ విద్య ఐదేళ్లు
8. దేశవ్యాప్తంగా ప్రాథమిక విద్యకు ఒకటే కరిక్యులమ్
9. పాఠ్యాంశాల భారం తగ్గించే కాన్సెప్ట్ నేర్పే ప్రయత్నం
10. ఇక నుంచి కస్తుర్బా గాంధీ బాలిక విద్యాలయ కేవలం 12వ తరగతి వరకు మాత్రమే
11. ఎంఫిల్‌ కోర్సును పూర్తిగా తొలిగించింది.
12. ప్రస్తుతం 10+2+3( టెన్త్, ఇంటర్, డిగ్రీ) విద్యా విధానం.. ఇక నుంచి 5+3+3+4 విద్యా విధానం
13. డిగ్రీ విద్య మూడు నుంచి నాలుగేళ్లు
14. పీజీ విద్య ఏడాది లేదా రెండేళ్లు
15. రీసెర్చి ఇంటెన్సివ్ లేదా టీచింగ్ ఇంటెన్సివ్ యూనివర్సిటీలు, అటానమస్ డిగ్రీ గ్రాంటింగ్ కాలేజీలు, మోడల్ మల్టీ డిస్సిప్లినరీ 
16. ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి యూనివర్సిటీలకు ఆమోదం
17. బీజేపీ 2014 ఎన్నికల మేనిఫెస్టోలో దేశంలో నూతన విద్యా విధానం తీసుకురానున్నట్టు చెప్పిన సంగతి తెలిసిందే.



టీచర్లకు ఒకరకంగా వరం:

ఈ కొత్త పాలసీ ప్రకారం ఉపాధ్యాయుల‌కు కూడా చాలా వెసులుబాట్లు కల్పించింది. బోధనేతర వ్యవహారాల కోసం వారిని విని‌యోగించ‌కూడ‌ద‌ని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన ప్రత్యేక పరిస్థితులు మినహా వేరే విషయాల ఆధారంగా వారిని బదిలీ చేయకూడదని పేర్కొంది. టీచ‌ర్ల‌కు నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ కార్యక్రమం అమల్లోకి వస్తుంది. ప్రతీ సంవత్సరం  కనీసం 50 గంటలపాటు టెక్నికల్ ట్రైనింగ్ తీసుకోవాలి.

ఈ పోస్టు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని క్రింద కామెంట్ బాక్సు లో తెలపండి. 

For More Information: New Education Policy 2020


Comments

Popular posts from this blog

అతనొక అనితర సాధ్యం

రాఫెల్ యుద్ధ విమానాలు కొనడం అవసరమా? కాదా?

నువ్వే దేవుడివి అయితే దేవుడే నీ వాడు - కథ

ది స్మోక్! ఎవరైనా చూసారా? - సీరియల్ స్టోరీ -పార్ట్ 1

ది స్మోక్! ఎవరైనా చూసారా? - సీరియల్ స్టోరీ -పార్ట్ 2

అపాత్ర దానమా ? స్పందించే హృదయమా ?

సందిట్లో సడేమియా! వరుణదేవుడు వచ్చెనయా!

ఎలా ఎదుర్కోవాలి? ఏది దారి?

గణేశా టూ భూ లోకమ్! కానీ ఇది కరోనా టైమ్!!