రాఫెల్ యుద్ధ విమానాలు కొనడం అవసరమా? కాదా?
రాఫెల్ యుద్ధ విమానాలు కొనడం అవసరమా? అనే ప్రశ్నకు జవాబు వెదికే ముందు అసలు రాఫెల్ గురించిన వివరాలు చూద్దాం.
రాఫెల్ డస్సాల్డ్ ఏవియేషన్ వారిచే తయారు చేయబడిన ట్విన్ జెట్ ఇంజెన్ యుద్ధ విమానం. ఇది షార్ట్ అండ్ లాంగ్ (తక్కువ మరియు సుదూర) లక్ష్యాలను చేధించగల టెక్నాలజీ తో రూపొందించబడింది.
భూ దాడులు సముద్ర దాడులు, అను క్షిపణి దాడులను సైతం నిరోధించగల శక్తి వీటి సొంతం. తొలుత ఈ విమానాలు ఫ్రెంచి నావికాదళం కోసం అభివృద్ధి చేయబడ్డాయి.
ఇవి ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్, మాలి, లిబియా, సిరియా మరియు ఇరాక్ దేశాల పైన యుద్ధ కార్యాలకై వినియోగించ బడ్డాయి. వీటిని మన దేశం తో పాటూ ఈజిప్టు, ఖతార్ కూడా కొనుగోలు చేశాయి.
భారత దేశం 36 రాఫెల్ యుద్ధ విమానాలకు 2015 న మోడీ ఫ్రాన్సు పర్యటన సందర్భంలో 53,000 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది.
చైనా తో భారత్ కు జరుగుతున్న సరిహద్దు వివాదాల సమయంలో అనుకున్న దానికంటే ముందరే 5 రాఫెల్ యుద్ధ విమానాలు భారత్ కి జులై 27 న చేరడం హర్షించ దాగిన పరిణామం.
ఈ క్షిపణులతో 100కిమి నుండి 600కిలోమీటర్ల వరకూ ఉన్న లక్ష్యాలను సునాయాసంగా భారత గగనతలం దాటకుండానే చేధించ గలం.
ప్రస్తుతం పూర్తి శిక్షణని అందుకున్న అయిదుగురు పైలెట్లతో ఈ విమానాలు భారత్ చేరాయి. మరో ఐదు త్వరలో బహుశా వచ్చే నెలాఖరుకు భారత్ చేరబోతున్నాయి . 2021 కల్లా భారత్ కి 36 విమానాలు సిద్ధంగా ఉంటాయి.
ఈ యుద్ధ విమానాలు పాకిస్తాన్ వద్ద ఉన్న ఎఫ్ 16 యుద్ధ విమానాల కన్నా అధునాతమైనవి. ఎఫ్ 16 యుద్ధ విమానాలు నాలుగో జెనెరేషన్ కి సంబంధించిన సింగిల్ ఇంజెన్ విమానాలు.
రాఫెల్ నాలుగు ముఖ్యమైన సాంకేతిక శక్తిని కలిగి వుంది .
1. 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ పరిధిలో ఒకేసారి 40 లక్ష్యాలను గుర్తించగల బహుళ-దిశాత్మక రాడార్.
2. శత్రు శిబిరాలు గుర్తించలేని పాసివ్ రాడార్ సెన్సార్ అమర్చ బడింది. ఇది చాలా ఖచ్చితమైన ఆప్టికల్ కెమెరా.
3. 10 సెం.మీ ఖచ్చితత్వంతో ఏ వేగంతోనైనా ఫోటోలను తీయగల భారీ డిజిటల్ కెమెరా.
4. చివరగా... స్పెక్ట్రా! ఇది సెత్రు రాడార్ల సిగ్నల్సు ని జామ్ లేదా కౌంటర్-జామ్ చేస్తూ, దగ్గరదా వస్తున్న శత్రు క్షిపణులను గుర్తించి హెచ్చరికలు పంపుతుంది.
అంతే కాకుండా డెకాయ్ సిగ్నల్ వ్యవస్థ వెనుకనుండి వస్తున్నా శత్రు సిగ్నల్సును బ్రేక్ చేసి డైవర్ట్ చేయగలదు.
ఇవి ఖరీదైనవే అయినా ఖచ్చితమైనవి.
ఇకపోతే వీటిని కొనడం అవసరమా? అనే ప్రశ్న కొందరు వేస్తున్నారు. ఇది పొరుగు దేశాల మధ్య ఆయుధ కొనుగోళ్ల పోటీకి దారి తీస్తుందని, అసలే కష్టాలలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ కు నష్టం చేస్తుందని అభిప్రాయ పడుతున్నారు. మనం బలపడుతుంటే చైనా, పాకిస్తాన్ వంటి దేశాలు చూస్తూ కూర్చుంటాయా? అవి కూడా ఇంకా అధునాతన మైన యుధ్ద విమానాలను, ఆయుధాలను సమకూర్చుకోవా? అనేది ప్రశ్న!
ఇందులో అనుమానం లేదు. ఈ రోజు కాకపొతే రేపైనా ఆ దేశాలు కూడా ఒక అడుగు ముందుకేసి వీటికన్నా అధునాతన మైన శక్తిని పొందే ప్రయత్నం చేస్తాయి. ఈ పోటీ ఖచ్చితంగా ఉంటుంది. వీటిని అమ్ముకోవడంలో ఫ్రాన్సు, రష్యా, జెర్మనీ, అమెరికా వంటి దేశాలు ఉత్సాహం చూపిస్తాయి.
అయితే పాము కాటు వేస్తుందని తెలిసి వాళ్ళు అప్పగించం, ఉప్పెన ముంచుకొస్తుందని తెలిసి మూల కూర్చోము. మనను మనం రక్షించుకునే ప్రయత్నం చేయకపోతే దురాక్రమణకు బలికావలసి వస్తుంది. శాంతి కాముక దేశం అంటే యుద్ధానికి తలవంచే దేశం అని అర్థం కాదు. బలమైన దేశాలకే శాంతి ఉంటుంది. కాంపౌండ్ వాల్ బలంగా ఎత్తు గా ఉంటేనే కదా జంతువులు గానీ దొంగలు గాని చొరబడ కుండా రక్షణ ఉంటుంది.
తెలుగులో ఒక సామెత ఉంది. కడిగిన ముఖం ఉంటె కాఫీ ఎప్పుడైనా త్రాగచ్చు. ముఖం కడగకుండానే కాఫీ కి రెడీ అయ్యే వారుంటారు. కాబట్టి ముఖం కడుగుకోవాలి, కాఫీకి సిద్ధంగా ఉండాలి.
ఒకసారి రెండు వందల సంవత్సరాల వెనక్కి వెళ్లి చూస్తే ... ఆంగ్లేయులు తుపాకీ, ఫిరంగులతో మనదేశపు రాజుల పై విరుచుకు పడి అకక్రమించుకుంటే మన వాళ్ళ కత్తులు, బల్లలు వారి ముందు నిలవలేక ఓటమి పాలై ఎంతో విలువైన సంపదలను పోగొట్టుకున్నాము. మరెంతో దుర్భర బానిస కష్టాలను మన పూర్వీకులు చవిచూశారు.
సైనిక పరంగా బలం గా ఉంటే దేశంలో శాంతి ఉంటింది. ఎంత విద్యా వేత్త అయినా, ఎంత ధనం సంపాదించినా, తగిన రక్షణ లేకపోతే ఫలితం అనుభవించాలి.
ఈ పోస్టు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని క్రింద కామెంట్ బాక్సు లో తెలపండి.

Comments
Post a Comment