గాన గంధర్వుడు ఎస్. పి. బాల సుబ్రహ్మణ్యం గారి ఆరోగ్యం బాగుండాలని ఆశిస్తూ
గాన గంధర్వుడు ఎస్. పి. బాల సుబ్రహ్మణ్యం గారి ఆరోగ్యం బాగుండాలని ఆశిస్తూ...
గాయక లోకబాంధవుడు గానవిలోలుడు సుభ్రమణ్యమై
మాయని కీర్తినొంది సినిమాకొక తీయని తేనెధారయై!
ఊయలలూపినాడు తనయూపిరి పాటకు ప్రాణమద్దుచున్
న్యాయమ దైవమా ఇటుల యాతని రోగపు రొచ్చుదింతువా!
అతని బాగుజేసి మరి ఆయువు పెంచుము దీర్ఘకాలమున్
చేతన శక్తినిచ్చి సరిచేయుము కోవిడు కాలపాశమున్!
లోతగు గుండెగాయములు లోక వినోదికి చేయజూతువా!
రాతను మార్చివేయుమిక రక్కసి కోరలు వమ్ముజేయుచున్!
Image Credits (Naidunia.com)

Comments
Post a Comment