ధోనీ కి అంకితం - తెలుగు పద్యాలు

 క్రికెటర్ ధోనీ కి అంకితం: ఉత్పలమాల లో


ధోనిగ పేరుపొందితివి దోషము లేని విజేతవై భళా!
బూనిన సూర్య తేజములె భూమిన బుట్టెను నీదురూపుగా!
లేనివి చెప్పలేము కద లేశము నైనను భారతీ సుతా!
దీనికి దానికేల జన దీవెన నీకె నిజంబు ధీరుడా!


కప్పులు కొట్టిజూపితివి కట్టుగ జట్టుకి నాయకుండవై
నిప్పులు చెండు తీరుగను నిర్దయ జూపక నిక్కి నీల్గుచూ
రొప్పుచు వేయు బంతులను రోషము మీరగ దూసి కొట్టుచూ
చప్పున గెల్చినావు కద చక్కగ నీవు ప్రపంచ కప్పునే!


కష్టములెన్నొ దాటి హెలికాప్టరు షాటుతొ కీర్తినొందగా
ఇష్టము మీద నాడితివి ఇంటరునేషను మేచులెన్నియో
పుష్టము జేత లేపితివి పుష్టిగ సిక్సులు యాట నేర్పుతో
నష్టము లేదు నీకిది ఘనంబగు ధోని విరామమొందుమా!


MS Dhoni (Credits: Twitter)



Comments

Popular posts from this blog

అతనొక అనితర సాధ్యం

రాఫెల్ యుద్ధ విమానాలు కొనడం అవసరమా? కాదా?

నువ్వే దేవుడివి అయితే దేవుడే నీ వాడు - కథ

ది స్మోక్! ఎవరైనా చూసారా? - సీరియల్ స్టోరీ -పార్ట్ 1

ది స్మోక్! ఎవరైనా చూసారా? - సీరియల్ స్టోరీ -పార్ట్ 2

అపాత్ర దానమా ? స్పందించే హృదయమా ?

ఇక నుంచి దేశవ్యాప్తంగా 5+3+3+4 విద్యా విధానం

సందిట్లో సడేమియా! వరుణదేవుడు వచ్చెనయా!

ఎలా ఎదుర్కోవాలి? ఏది దారి?

గణేశా టూ భూ లోకమ్! కానీ ఇది కరోనా టైమ్!!