ది స్మోక్! ఎవరైనా చూసారా? - సీరియల్ స్టోరీ -పార్ట్ 3

 జరిగిన కథ: సీరియల్ మర్డర్ కేసులో ఐదవ కేసును ఇన్వెస్టిగేషన్ చేయడానికి వెళ్తాడు వర్మ. సీసీ కెమెరాలను చెక్ చేస్తారు. కానీ అవసరమైన చోట కెమెరాలు లేక పోవడం వలన నేరస్తులను గుర్తించలేకపోతాడు వర్మ. ఇంతలో ఒక ఇంటి యజమాని తనకు చిన్న క్లూ ఇస్తాడు. 

వర్మ తాను శాకరించిన వివరాల ఆధారంగా ఇన్విస్టిగేటషన్ చేస్తాడు. ఆ ఇన్విస్టిగేషన్లో వాళ్ళు ఒక వేన్ ని అనుసరిస్తారు. కానీ అది వాళ్ళ కళ్ళు గప్పి అదృశ్యం అవుతుంది. 


*****


రాత్రి తొమ్మిదయినా తన ఛాంబర్ లో కూర్చుని ఆలోచించుకుంటున్నాడు వర్మ. 

అంత షడన్ గా ఆ కారు ఎలా మాయమైంది. ఆ ప్రాంతమంతా జల్లెడ పట్టి వెతికారు. అయినా ఫలితం లేకపోయింది. కష్టం అంటా వృధా అయింది. పొరపాటు ఎక్కడ జరిగింది. అంత తెలివిగా ఎలా తప్పించుకో గలిగారు వాళ్ళు. 

వేన్లో పట్టుబడిన ఆ నలుగురూ అస్సలు నోరు విప్పటం లేదు. కొట్టి కొట్టి అలసిపోతున్నారు వాళ్ళ నుండి విషయం రాబట్టడానికి. 

బూట్ల సౌండ్ విని తల పక్కకి తిప్పి చూసాడు వర్మ. 

కానిస్టేబుల్  స్టిఫ్ గా నిలబడి సెల్యూట్ చేసాడు. 

సార్ మీకోసం ఎవరో సూరిబాబు వచ్చాడు. మీకు ఏదో చేప్పాలంట.  అన్నాడు. 

సరే తీసుకురా! అన్నాడు వర్మ. 

సూరిబాబు భయ భయంగా వచ్చి నమస్కారం పెట్టాడు. 

ఏంటి చెప్పు. కొంచెం విసుగ్గా అడిగాడు వర్మ. 

సార్! మీరు ఆ డెడ్ బాడీస్ గురించి న్యూస్ లో చెప్పింది చూసి వచ్చాను సార్. మీరు చూపించిన ఫొటోలలోని వాళ్ళను నేను చూసాను. 

మరింత భయపడుతూ చెప్పాడు సూరిబాబు. 

చూసావా... భయపడకు. ధైర్యంగా చెప్పు. ఎవరు వాళ్ళు. 

సార్. వాళ్ళు ఊరి చివర  బ్రోతల్ హౌస్ నడుపుతూ వుంటారు సార్. ఐదుగురూ ఒకే ఇంట్లో ఉంటారు. ఎవరైనా బుక్ చేసుకుంటే వెళ్లి వస్తుంటారు. ఆ మధ్య పదిహేను రోజుల క్రితం ఒక వేన్ వచ్చింది. ఆ నలుగురూ ఇంటికి తాళం వేసుకుని ఆ వెం ఎక్కడం చూసాను. నేను ఆ ఇంటికి ఎదురుగానే ఉన్న గుడిసెలో ఉంటాను. వాళ్ళని ఎవరో బుక్ చేసుకుని ఉంటారు అనుకున్నాను. 

సాధారణంగా వాళ్ళు వెళ్లిన మరుసటి రోజే వస్తారు. కానీ ఇన్ని రోజులైనా రాక పోయేసరికి కొంచెం అనుమానం వచ్చింది. నిన్న మీ న్యూస్ చూడగానే అర్థం అయింది. వాళ్ళు చనిపోయారని. అలా చనిపోడానికి వాళ్ళు రోగిష్టివాళ్లు కాదు సారూ... ఏదో జరిగి ఉంటుంది. అన్నాడు సూరిబాబు. 

వర్మకి సూరిబాబు మాటలు తల తిరిగేలా చేశాయి. కనకారావు అవి హత్య కాబడినవి కావు అని చెప్పాడు. మరి అంట షడన్ గా ఎలా చనిపోతారు. 

సరే.... రాజూ ఇతని వఙ్గమూలం రికార్డ్ చెయ్యి. అంటూ అతన్ని రాజుతో వెళ్ళమని చెప్పాడు వర్మ. 

కనకారావు కి ఫోన్ చేసి ఈ విషయం చెప్పాడు. 

బహుశా వాళ్ళు అలా చనిపోడానికి ఏదైనా కెమికల్ గాస్ వాడి ఉంటారు. అతి తక్కువ మోతాదులో ఒక రూమ్ లో పెట్టి గాస్ ని ఆ రూంలోకి పంపితే ఎటువంటి ఆందోళన లేకుండా వాళ్ళు చాలా సహజ మరణం వచ్చిన వారిలా చనిపోతారు. వన్ డే తర్వాత వాళ్ళ శరీరాల నుండి ఆ గాస్ కి సంబంధించే ఆనవాళ్లు పోతాయి. 

బహుశా ఆ ఐదుగురునీ ఆ ప్రాసెస్ లో చంపేసి ఉంటారు. ఇది మరో కొత్త ట్విస్ట్. అన్నాడు కనకారావ్. 

*****

నెల రోజుల తర్వాత... 

అది చాలా విశాలమైన లాబరేటరీ. ఒక రిసార్ట్సు క్రింద సెల్లార్ లో ఉంది. అక్కడ అల్లాంటి ఒక ల్యాబ్ ఉంటుందన్న ఊహ కూడా ఎవరికీ రాదు. కానీ ఆ ల్యాబ్ లో పని చేస్తున్నది పది మంది మాత్రమే. 

ఆ ల్యాబ్ కి పక్కన దానికి ఆనుకుని మరికొన్ని ఆఫీసు రూములు ఉన్నాయి. 

వాటిముందు కొంతమంది గార్డులు మెషీన్ గన్సు తో కాపలా వున్నారు.  ఆ లాబ్ పూర్తిగా నిఘా నీడలో ఉంది. 

లోపల అనిత  హాకింగ్ లో బిజీగా ఉంది. ప్రక్కనే డేటా అనలిస్ట్ నీలిమ  కూర్చుని ఉంది. 


అనిత ! నువ్వు సాఫ్ట్వేర్ ఇంజినీర్ వని తెలుసు కానీ ఇలా హాకింగ్ చేస్తావని తెలీదు. అంది డేటా అనలిస్ట్ నీలిమ. 

హాకింగ్ నా ఫేవరిట్ అక్టీవిటి ! సరదాగా మొదలు పెట్టాను! కానీ అదే ఇప్పుడు నన్ను ఇక్కడకి తెచ్చి పడేసింది. అంది అనిత. 

హుమ్ ... నీకేం...  నువ్వు హాకింగ్ చేసి డేటా డంప్ చేసి పడేస్తున్నావ్. కానీ నాకు దానినంతా అనలైస్ చేసి వీళ్లకు కావలసింది కన్సాలిడేట్  చేసి డాక్యూమెంట్ చేయడం చాలా కష్టం గా ఉంది. అంది నీలిమ కొంచెం నవ్వుతూ. 

అసలిదంతా ఆ సైన్టిస్టు భారతి వలన వచ్చింది. ఆమె ఎవడిదగ్గరో తన ప్రాజెక్ట్ గురించి వాగింది, అది కాస్తా వీళ్ళ చెవిన పడింది. అంది నీలిమ తల అడ్డంగా ఊపుతూ. 

రాత్రి లేదు పగలు లేదు... ఎవరైనా వచ్చి కాపాడతారనే ఆశ లేదు.  వాళ్ళు అనుకున్నది పూర్తయ్యాక మనల్ని వదిలేస్తారో చంపేస్తారో తెలీదు. ఇలా ఎన్నాళ్ళు? అంది నీలిమ మరింత దీనంగా 

మనం ఎదిరించలేమని వీళ్ల ఉద్దేశ్యం. అందుకే అందరినీ లేడీస్ నే ఎంచి మరీ కిడ్నాప్ చేశారు. అంది అనిత 

నేను మా వారి ప్రక్కనే పడుకుని ఉన్నాను... ఇక్కడి ఎలా వచ్చానో కూడా అర్థం కాలేదు. ఆయన ఎలా ఉన్నారో ఏంటో ! అంది దిగాలుగా నీలిమ. 

*****

ఆ హాలు చాలా డిమ్'లైటింగ్లో ఉంది.  ఒకరి ముఖాలు ఒకరికి తెలియనంతగా...  చిన్న వేదిక మీద ఒక వ్యక్తి వీల్ ఛైర్ లో కూర్చుని ఉన్నాడు. జరిగిన మొత్తం కథకి అతడే కీలకమైన వ్యక్తి. హాలు నిశ్శబ్దంగా ఉంది. 

ఆ నిశ్శబ్దాన్ని బ్రేక్ చేస్తూ గొంతు సవరించుకున్నాడు ఆ వ్యక్తి.  మిమ్మల్నందరినీ ఇప్పుడు ఎందుకు ఇక్కడికి రమ్మన్నానో తెలుసా.... అంటూ ... ఆ కంఠం ఒక స్త్రీ గొంతు! 

మన పని పూర్తి అయింది. మనం ఒక బయో వెపన్ తాయారు చేసాం. సైటిస్ట్ భారతిని అభినందిస్తున్నాను. ఈ వెపన్ తయారీలో ఆమెదే కీలక పాత్ర. ఈ వెపన్ మనుషుల జన్యువులపై అటాక్ చేసి వారి సమర్థత, ఆలోచనల పై తీవ్ర ప్రభావం తీసుకువస్తుంది. వారిని శారీరకంగా బలహీనంగా మారుస్తుంది. 

ఆమె సాహితీ పబ్లికేషన్ అధినేత మాళవిక!

అనిత హాక్ చేసి తెచ్చిన బయో కెమికల్ రీసెర్చి డాటా  ఇందుకు మనకి ఉపయోగ పడింది. నీలిమ అనాలసిస్ నాకు కావలసినట్లుగా నేను ఉపయోగించుకున్నాను. కానీ మీరు ఇదంతా ఎందుకు చేశారో మీకు తెలియదు. దీని ఫైనల్ ఫార్ములా మొత్తం ఇప్పుడు డాక్యూమెంట్ అయింది. 

మన క్రింద పనిచేస్తున్న మరికొందరు కెమిస్టులు దీనిని ఆయధంగా మార్చారు. ఇకపై దీనిని అత్యంత రహస్యంగా... గాలిలో విడుదల చేస్తాం. 

చూడటానికి సాధారణ పొగలా ఉంటుంది. ఎటువంటి భయమూ కలిగించదు. సెకన్లలో గాలిలో కలసిపోయి కిలోమీటర్ల దూరం విస్తరిస్తుంది. దీని పనితనం ఏమిటో అర్థం చేసుకునే లోపే వారు మన అదుపులోనికి వచ్చేస్తారు. హహహ్హా అంటూ మరింత బిగ్గరగా నవ్వింది. 

అనిత, నీలిమలు బిత్తర పోయారు. ఈ భారతికి ఇదేం బుద్ధి ఇలాంటిది కనిపెట్టింది! అనుకున్నారు ఒకరినొకరు చూసుకుంటూ. 

*****

ఆ రోజు రాత్రి... నీలిమా!  మనం ఎలాగైనా తప్పించుకోవాలి! ఈ రహస్యం బయట పెట్టాలి! అంది గుసగుస లాడుతూ అనిత. 

ఎందుకు? దీనివల్ల మనకి నష్టం లేదుగా... అంది నీలిమ ఆనందంగా. 

పిచ్చిదానా ఇంత ఖర్చుపెట్టి ఇది సమాజం మార్చడానికి ఉపయోగిస్తుంది అనుకుంటున్నావా? అంది అనిత 

మరి? ఆశ్చర్యంగా అడిగింది అనిత. 

కాస్త గుర్తుకు తెచ్చుకో! మనం కలెక్ట్ చేసిన డాటాలో సైనిక సంబంధమైనవి, పోలీస్, పార్లమెంట్, ఇతర ప్రభుత్వ డిపార్టుమెంట్లకి సంబంధినది ఉంది. 

అలాగే... పాకిస్తాన్, చైనా వంటి దేశాలలో కూడా డాటానిసేకరించిందిట. ఈమె అసలు ఉద్దేశ్యం ఈ ఆయుధాన్ని ఐరోపా దేశాలకు అమ్మడం. 

మన దేశంలో కూడా ప్రజాస్వామ్యాన్ని కూల ద్రోసి నియంత రాజ్యం నిర్మించడం. 

నీకొక మరో ముఖ్యమైన రహస్యం చెప్పనా... భారతి చెప్పింది. ఈ కెమికల్ వలన మహిళల లో కూడా చాలా మార్పులు వస్తాయట. కానీ వాటికి సైడ్ ఎఫెక్ట్సు ఎక్కువై... అందరిలో నేర స్వభావం, మానసిక ఉన్మాదం పెరుగుతుందట. భయంగా చెప్పింది అనిత. 

ఆమ్మో!... ఇప్పుడెలా ... ఆందోళన పడుతూ అడిగింది నీలిమ. 

ఈ మాళవిక ఒక పెద్ద సైకో. మగ ద్వేషి. సంవత్సరం క్రితం భారతి ఒక సెమినార్లో ఈమెకి పరిచయం అయింది. 

ఆమె మానవ  జన్యువుల పై రీసెర్చి చేసి అనేక ప్రయోగాలు చేసిందట. కానీ సమాజానికి హాని చేయటం ఆమె ఉద్దేశ్యం కాదంది. భారతిని ట్రాప్ చేసి ఇక్కడకి తీసుకు వచ్చిందిట  మాళవిక.  

మనం ఈ రాత్రికి ఎలాగైనా తప్పించుకోవాలి. అంది అనిత. 

*****

నాకెందుకో ఈ నేరాలన్నీ ఒక మహిళా సైకో పని అని అనిపిస్తోంది. అన్నాడు వర్మ కనకారావు తో. 

ఆమెకి వ్యభిచారులంటే అసహ్యం. ఆ వృత్తి వారిపై ద్వేషం ఉండి ఉండాలి. అందుకే వారిని చంపింది. అన్నాడు మరికొంచెం ముందుకు తల వంచి. 

అదేంటి? మగ సైకో ఎందుకు కాకూడదు? అన్నాడు కనకారావు. 

ఎందుకంటే ఆమె కిడ్నాప్ కి ఎంచుకున్నది కూడా ఆడవారినే... అందులోనూ వారంతా చదువుకున్న ప్రతిభావంతులు. 

నెల రోజులైనా ఎవ్వరి ఆచూకీ బయటపడలేదంటే...  వాళ్ళ ద్వారా ఏదో చేయ్యబోతోందని నా అనుమానం. 

బహుశా ఏదో బయో వెపన్! అన్నాడు వర్మ. 

బయో వేపనా! అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవ్ ? అడిగాడు కనకారావు. 

ఈ నేరాలలో మొదట కిడ్నాప్ అయింది భారతి అనే జెనెటిక్ రిసెర్చి కి సంభందించిన శాస్త్రవేత్త. అదే నా అనుమానానికి కారణం. 

ఓహ్... నీ అనుమానం నిజమే అయిఉంటుంది. సో... ఇప్పుడెలా? అడిగాడు కనకారావు. 

చెప్తా... రాజూ మనం కొంత సిబ్బందిని వెంటపెట్టుకుని ఆ రోజు మనం ఆ కారును మిస్సైన ప్రదేశానికి వెళ్దాం. ఈసారి అంగుళం అంగుళం గాలిద్దాం. ఆ ఏరియాలో ఎక్కడైనా అనుమానం కలిగించే కట్టడం గానీ అండర్ గ్రౌండ్ గానీ ఉండిఉండాలి. 

ఓకే వర్మ... నేను అందరినీ రెడీ చేస్తాను. ఒక గంటలో బయలుదేరదాం అన్నాడు రాజు. 

ఈసారి మేము కూడా వస్తాం వర్మా... అన్నారు విజయ్, కనకారావులు. 

*****

రాత్రి పదకొండు గంటలు కావస్తోంది. ఆ గదిలో ఇద్దరు సెక్యూరిటీ గార్డుల దేహాలు పడివున్నాయి వారి డ్రెస్ ని మార్చి, నీలిమా అనితా వేసుకుంటున్నారు. అతి సాహసం మీద వారిని మత్తు జల్లి పడగొట్టారు వీళ్ళు. అందుకు భారతి సహాయపడింది. 

గార్డు డ్రెస్ లో ఉండటం వలన ఎవ్వరూ  పెద్దగా అనుమానించ లేదు. వెనుక మెట్ల గుండా పైకి వచ్చారు. పైన అంతా లైటింగ్ తో గార్డెన్ లా ఉంది. 

ఇది మాళవికా రిసార్ట్సు అంది అనిత. ఇంతకు ముందు మావారితో ఇక్కడికి వచ్చాను నేను.  అంది. ఇద్దరూ చీకటి నీడలలో తల వంచుకుని నెమ్మదిగా వెనుక వైపు ఉన్న ప్రహారీ దగ్గరకి వెళ్లారు. 

ఈ గోడ దాటడం మన వల్ల కాదు. ఏంచేద్దాం అంది అనిత. 

ఏముంది రిసార్ట్సు మెయిన్ గేట్ నుండి దర్జాగా వెల్దాం. ఏమైతే అదయింది గార్డు డ్రెస్ తీసి విజిటర్సు'లాగ వెల్దాము. అంది నీలిమ. 

ఇటువైపు నుండి వెళ్తే లగ్జరీ రూమ్ లు ఉంటాయి. రాత్రి పూట ఉండేందుకు కొందరు ఈ రూమ్లు బుక్ చేసుకుంటారు. ఎవరైనా మనకి సహాయ పడవచ్చు. అంది అనిత. 

ఇద్దరూ అటువైపు బయలుదేరారు. కానీ బాడ్ లక్  వాళ్ళని కొందరు గార్డులు గుర్తుపట్టారు. 

ఇంక ఎక్కడలేని ధైర్యం తెచ్చుకుని ముందుకు పరిగెత్తారు అనిత నీలిమ. 

గార్డులని నెట్టుకుంటూ ఎంట్రన్సు గేటు దాటి పరుగుతీశారు. 

అంతే వేగం తో వాళ్ళను గార్డులు వెంబడించారు. 

చీకటిలో చెట్ల మధ్యకు పరుగు తీశారు. వాళ్ళ వెనక టార్చి లైట్లు వెలిగిస్తూ వెంటపడ్డారు గార్డులు. 

*****

డ్రోన్ల సహాయంతో ఆ ప్రాంతమంతా జల్లెడ పడుతున్నారు వర్మ టీమ్. 

షడన్ గా వారి కంటికి చెట్ల మధ్య ఎవరో పరిగెడుతున్నట్లు కనిపించింది. 

సార్... మాళవికా రిసార్ట్సు నుండి ఎవరో ఇద్దరు పరిగెడుతూ ఉన్నారు.  వాళ్ళ వెనుక మరికొంతమంది వెంట పడుతున్నట్లు ఉంది. అన్నాడు డ్రోన్ ని ఆపరేట్ చేస్తున్న కానిస్టేబుల్. 

మాళవికా రిసార్ట్సా... అంటే... కిడ్నాప్ అయిన మాళవికాకీ ఈ రిసార్ట్సుకీ సంబంధం ఏమైనా ఉందా... రాజూ ... పదండి. అందరం అటువైపు వెళ్దాం అంటూ వర్మ ముందుకు  పరుగు తీసాడు. 

విజయ్ మరికొంత మంది పోలీస్ ట్రూప్సు ని పంపమని హెడ్ ఆఫీసుకి మెసేజ్ పెట్టాడు. 

*****

చీకటిలో ముందు ఏముందో కనిపించటం లేదు అయినా గుడ్డిగా పరుగు తీస్తున్నారు అనిత, నీలిమ. 

మధ్య మధ్య అలసట తీర్చుకోడానికి చెట్ల చాటున దాక్కుంటూ... గార్డుల కళ్ళు కప్పి పరుగు తీస్తున్నారు. 

ముళ్ళు గీసుకుని బట్టలు చిరుగుతున్నాయి. వంటికి గాయాలవుతున్నాయి. రక్తాలు కారుతున్నాయి. అయినా లెక్క చేయకుండా పరిగెడుతున్నారు. 

ఇంతలో అనిత కాలికి ఏదో తగిలి ముందుకి తూలి పడింది. నీలిమ ఆమెను లేపే ప్రయత్నం చేస్తోంది. గార్డులు ఇద్దరినీ చుట్టుముట్టారు. 

మేడమ్! వాళ్ళు దొరికారు. కట్టి తీసుకు రమ్మంటారా... లేదా ఇక్కడే ఫినిష్ చేయమంటారా? అడిగాడు మాళవికకి ఫోన్ చేసి ఒక గార్డు. 

అనితనీ నీలిమని చూసి చిన్న వెకిలి నవ్వు నవ్వాడు. 

వాళ్ళేం చేయబోతున్నారో ఊహించుకునేసరికి వెన్నులో చలి మొదలైంది ఇద్దరికీ. 

అనిత నేలని తడుముతూ వెన్నక్కి జరిగింది. ఆమె చేతులకు నేలపై కొన్ని రాళ్లు తగిలాయి. వాటిని చేతులలోకి తీసుకుని బలంగా ముందుకు విసిరి, నీలిమ చేయి పట్టుకుని పరుగు తీసింది. 

ఇంతలో వర్మ అక్కడికి చేరుకున్నాడు. అతని వెనుకనే పోలీసులు వచ్చి గార్డులపై దాడి చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. 

క్షణాల మీద పోలీసులు రిసార్ట్సుని చుట్టుముట్టారు. అనిత వర్మకి జరిగింది అంతా వివరించి చెప్పింది. అండర్ గ్రౌండ్ కి దారి చూబించింది. 

లేబొరేటరీ లోని అందరినీ అరెస్టు చేశారు. కానీ మాళవిక అక్కడ నుండి అసలైన డాక్యూమెంట్లతో ఉడాయించింది. 

*****

పోలీసులు సిటీ అంతా మాళవిక కోసం గాలిస్తున్నారు. 

వర్మ, రాజూ  మాళవిక ఇంటిపై దాడి చేసి మేనేజర్ ని అదుపులోకి తీసుకున్నారు.  ఆమె ఇంటిని మొత్తం గాలించారు.

గోడ మీద ఒక పెయింటింగ్ వర్మ ని ఆకట్టుకుంది. ఆ పెయింటింగ్ సూట్ వేసుకుని ఉన్న ఒక నలభై ఏళ్ళ వ్యక్తిది. అతడి కోటు బటన్ కొంచెం ఉబ్బెత్తు గా ఉంది. 

దానిని ప్రెస్ చేస్తే డోర్ ఓపెన్ అయి, ఆ ఫ్రేమ్ వెనుక చిన్న అర కనిపించింది. అందులో కొన్ని ఆల్బమ్లు, డాకుమెంట్లు కనిపించాయి. 

వాటిని చూసి వర్మ ఆశ్చర్యంతో షాక్ కి గురయ్యాడు.... మాళవిక స్త్రీ కాదు. 


(పార్ట్-4 త్వరలో)  

 ఈ కథలోని పాత్రలూ, సన్నివేశాలూ కేవలం కల్పితం. ఎవరినీ ఉద్దేశించినవి కావు, ఎందునుండీ సేకరించినవి కావు. 






Comments

Popular posts from this blog

అతనొక అనితర సాధ్యం

రాఫెల్ యుద్ధ విమానాలు కొనడం అవసరమా? కాదా?

నువ్వే దేవుడివి అయితే దేవుడే నీ వాడు - కథ

ది స్మోక్! ఎవరైనా చూసారా? - సీరియల్ స్టోరీ -పార్ట్ 1

ది స్మోక్! ఎవరైనా చూసారా? - సీరియల్ స్టోరీ -పార్ట్ 2

అపాత్ర దానమా ? స్పందించే హృదయమా ?

ఇక నుంచి దేశవ్యాప్తంగా 5+3+3+4 విద్యా విధానం

సందిట్లో సడేమియా! వరుణదేవుడు వచ్చెనయా!

ఎలా ఎదుర్కోవాలి? ఏది దారి?

గణేశా టూ భూ లోకమ్! కానీ ఇది కరోనా టైమ్!!