భారత పదాతి, వాయు, నావికా దళాలకు అంకితం - తెలుగు పద్యాలు

 భారత పదాతి, వాయు, నావికా దళాలకు అంకితం:


భారత జాతికేతనము భాగ్యత నొందగ కీర్తివంతమై
ధీరత జూపి దేశమున దీక్షగ నిల్చిన వీర సైనికా!
తీరపు దేశహద్దులను తీరుగ గాచు సురక్ష కారకా!
ఆరఘు రామదీవెనలు అండగ యుండును నీకు మెండుగా!


సాగర మందుశూరునిగ సాయుధ నౌకల తేలియాడుచున్
జాగర మొంది దేశమును జాగిల మల్లెను జాగురూకమై
రాగల కీడు ముందె గని రాముని సేనగ రక్షజేయుచున్
చేగల శౌర్య నావికుల చేతన శక్తికి వందనం బిదే!


దీటుగ వాయువేగముగ దిక్కులు చీల్చుతు దూసుకెళ్ళుచూ
మాటున దాగిదేశమును మబ్బుర రీతిని గాపుకాచుచూ
ఘాటుగ వేగవంతముగ గన్పడు లక్ష్యము లెల్ల గూల్చుచూ
కాటుక చీకటైన వెనుకాడని శక్తివి వాయుసైనికా!

Comments

Popular posts from this blog

అతనొక అనితర సాధ్యం

రాఫెల్ యుద్ధ విమానాలు కొనడం అవసరమా? కాదా?

నువ్వే దేవుడివి అయితే దేవుడే నీ వాడు - కథ

ది స్మోక్! ఎవరైనా చూసారా? - సీరియల్ స్టోరీ -పార్ట్ 1

ది స్మోక్! ఎవరైనా చూసారా? - సీరియల్ స్టోరీ -పార్ట్ 2

అపాత్ర దానమా ? స్పందించే హృదయమా ?

ఇక నుంచి దేశవ్యాప్తంగా 5+3+3+4 విద్యా విధానం

సందిట్లో సడేమియా! వరుణదేవుడు వచ్చెనయా!

ఎలా ఎదుర్కోవాలి? ఏది దారి?

గణేశా టూ భూ లోకమ్! కానీ ఇది కరోనా టైమ్!!