Telugu poems on Lantern Memories



ఉత్పలమాల:
తాతల నాటి వైభవము తారసమైనది నిన్ను చూడగా

భూతల మందు నీ యుగము భూషణ మాయెను మానవాళికిన్ 

భీతి నెఱుంగరే  జనులు భీకర రూపము గాన వచ్చినన్  

చేతను బూని మా తరము  చేసిరి ఎన్నియొ  మేటి కార్యముల్ 


లండను నుండి వచ్చితివి లాంతరు పేరున మాదు నేలకున్ 

నిండగు కాంతులీనెదవు  నింగికి నేలకు తారవై భళా 

మెండగు మా నివాసమున మేలిమి బంగరు జ్యోతి దీపికా 

దండము నీకు మా జనపదంబున  మాయని కీర్తి చంద్రికా 



Comments

Popular posts from this blog

అతనొక అనితర సాధ్యం

రాఫెల్ యుద్ధ విమానాలు కొనడం అవసరమా? కాదా?

నువ్వే దేవుడివి అయితే దేవుడే నీ వాడు - కథ

ది స్మోక్! ఎవరైనా చూసారా? - సీరియల్ స్టోరీ -పార్ట్ 1

ది స్మోక్! ఎవరైనా చూసారా? - సీరియల్ స్టోరీ -పార్ట్ 2

అపాత్ర దానమా ? స్పందించే హృదయమా ?

ఇక నుంచి దేశవ్యాప్తంగా 5+3+3+4 విద్యా విధానం

సందిట్లో సడేమియా! వరుణదేవుడు వచ్చెనయా!

ఎలా ఎదుర్కోవాలి? ఏది దారి?

గణేశా టూ భూ లోకమ్! కానీ ఇది కరోనా టైమ్!!