Posts

Showing posts from July, 2020

అపాత్ర దానమా ? స్పందించే హృదయమా ?

Image
సాధారణంగా ఒకరి కష్టం చూసి స్పందించే వారిలో జాలి పడే వారు ఎందరు వున్నా ...  తొంభయ్ శాతం మంది మనకెందుకులే అనుకునే వారే ఉంటారు. ఐదు శాతం మంది అన్నీ తెలుసుకొని సహాయం చెయ్యాలా వద్దా, అతడి కష్టం గురించిన వార్త ఎంత వరకు నిజం? సహాయం వృధా అవుతుందా? ప్రయోజనం వుంటుందా? అని పరిశీలించిన తరువాత గాని ముందుకు రారు.   కానీ ఒక అడుగు ముందుకేసి తక్షణ సహాయం చేసేవారు  కొందరే ఉంటారు.  అటువంటి వారిలో సోను సూద్ ఒకరు.  సోనూ సూద్ ముందు వెనకాలు ఆలోచించకుండా సహాయం చేస్తున్నాడనే విమర్శ చాల మంది చేస్తున్నారు. అది కొంత వరకు నిజం కావచ్ఛు. కానీ పూర్తిగా నిజం కాదు. అటువంటి విషయాలలో విమర్శలు సహాయం చేయాలనే స్ఫూర్తిని దెబ్బ తీస్తాయి.  ఒక వేళ అతను తొందర పడి సహాయం చేసి వున్నాడని అతను భావిస్తే అతనే దానిని సరిదిద్దు కుంటాడు. లేదా అతనే దాని ఫలితం అనుభవిస్తాడు.  దాని వలన విమర్శించే వారికి వఛ్చిన నష్టం ఏమీ లేదు.  సమస్య ఎక్కడ వస్తోందీ అంటే ... అతన్ని దేవుడిని చేసి, ఇతర సెలెబ్రెటీలను తక్కువ చేసి సోషల్ మీడియాలలో చాలామంది నెటిజెన్లు పోస్టులు పెట్టడం వలన వారి ప్రతిష్ట దెబ్బ తింటోందని మరికొ...