Posts

Showing posts from May, 2021

తెలుగు పద్యాలు

ఎక్కడి నుండి పుట్టి మరియెందరి సోకి చరించెనో కదా! ఇక్కడ రాటుదేలెనట యీదశ మారణ కామరూపిణై! చిక్కక పోయె రేణువు విచిత్రపు రూపున మార్పునొంది తా రెక్కలు విచ్చుచున్, పురెత్తుచు వాలెను మానవాళి పై! కోపము జూపినావుయని కోరిన మాస్కుల నీయలే దనన్ పాపము జేసినారచట పాశవికంబుగ దాడీజేతురా! నీపని నీవు జేసితివి నీతిగ లోపము లెంచిజూపుచున్ శాపము బెట్టిపోయితివి శాశ్వత మీగతి వైద్యబాంధవా! 🙏🙏🙏🙏🙏🙏  నిన్నటి రోజు నాదనుచు నిర్భయ జీవన పోరుసల్పిరే! మిన్నగ కీర్తినొందితిరి మిధ్యగ తోచిరి నేడుమాయమై పున్నమి చంద్రశేఖరుని పుత్తడి కాంతుల రేఖచందమై సన్నని కారుచీకటుల సద్గతి నొందిరి సత్యసంధులై కోరికలెన్నియో గలవు కోవెల దేవుడు దీర్చునెప్పుడో తీరిక లేనివాడుగద తీయగ సేవలు పొందుచున్ ఇలన్ చేరి మనంబు నంతయును చేష్టలు నిల్పుచు పూజసే యగా దారిని జూపువాడతడు దాసుగ జేతుల నెత్తిమ్రొక్కెదన్ ఊపిరి యున్నదాకనె మయూరపు పింఛపు సొంపులీ కనుల్ జూపిన వన్నెచిన్నెయలు జూడక మాయును రెప్పచాటునన్ లేపిన లేవలేని గతి లేని కఠోరపు మృత్యు ఘంటికల్ కోపిత శూలధారి లయ క్రోదిత నేత్రమె రాల్చు భాష్పముల్! చూసితి నీతివంతమగు చూడని పాలన నిద్దురన్కలన్ వ్రాసితి పద్యగద్యకర వాలమ...